• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Year Ender : 'స్పుత్నిక్' జర్నీ.. ప్రపంచానికి ఆశలు రేకెత్తించిన మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్..

|

కరోనా మహమ్మారి విలయానికి 2020లో ప్రపంచ దేశాలన్నీ తల్లడిల్లిపోయాయి. మానవాళికి మహా విషాదాల్ని మిగిల్చిన వైరస్ మహమ్మారుల గురించి చరిత్రలో మాత్రమే చదువుకున్న నేటి సమాజానికి కరోనా రూపంలో ఊహించని ఉపద్రవం ఎదురైంది. చైనాలోని వుహాన్‌లో బయటపడ్డ ఈ వైరస్ మహమ్మారి స్వల్ప వ్యవధిలోనే ప్రపంచ దేశాలకు పాకి సమస్త మానవాళిని గడగడలాడించింది.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15,63,487 మందిని బలితీసుకుంది. కరోనా ప్రపంచ దేశాలకు తీరని నష్టాన్ని మిగిల్చినా ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రపంచానికి పాఠాలు నేర్పింది. ఇప్పుడిప్పుడే ఈ వైరస్‌కు విరుగుడుగా టీకాలు అందుబాటులోకి వస్తున్నాయి. రష్యా అభివృద్ది చేసిన 'స్పుత్నిక్ వి' ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌గా రికార్డుల్లోకి ఎక్కింది.

జులైలో ప్రకటన... అగస్టులో సిద్దం...

జులైలో ప్రకటన... అగస్టులో సిద్దం...

ప్రపంచ దేశాలన్నీ కరోనాను ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమవుతున్న తరుణంలో.. ఈ ఏడాది జులైలో రష్యా 'స్పుత్నిక్ వి' ప్రకటన చేయడం అందరిలోనూ ఆశలు రేకెత్తించింది. మాస్కోలోని గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ను అభివృద్ది చేసినట్లు ప్రకటించింది. జూన్ 18న మొదటి దశ ప్రయోగాల్లో భాగంగా 38 మంది వాలంటీర్లకు ఈ వ్యాక్సిన్ ఇచ్చారు. ఆ తర్వాత జులై 20న రెండో దశ ప్రయోగాలు చేపట్టారు. రెండు దశల్లోనూ వాలంటీర్లలో రోగ నిరోధకత అభివృద్ది చెందడంతో వ్యాక్సిన్ విజయవంతమైనట్లు ప్రకటించారు. అంతేకాదు,ఎమర్జెన్సీ వినియోగం కోసం అగస్టులోనే ఈ వ్యాక్సిన్‌ను రష్యా నమోదు చేయించింది.

ఇటీవలే స్పుత్నిక్ వితో మాస్ వ్యాక్సినేషన్...

ఇటీవలే స్పుత్నిక్ వితో మాస్ వ్యాక్సినేషన్...

అతికొద్ది మంది వాలంటీర్లపై మాత్రమే క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి... వ్యాక్సిన్ విజయవంతమైనదని చెప్పేందుకు దాన్నే ప్రాతిపదికగా తీసుకోవడంపై రష్యాపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. కనీసం మూడో దశ ప్రయోగాలు కూడా పూర్తి కాకముందే వ్యాక్సిన్‌ను ఎమర్జెన్సీ వినియోగానికి అందుబాటులోకి తీసుకురావడమేంటని ఆరోగ్య నిపుణులు ప్రశ్నించారు. అయినప్పటికీ రష్యా వెనక్కి తగ్గలేదు. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ 92శాతం సమర్థవంతంగా పనిచేస్తోందని ప్రకటించిన ఆ దేశం... ఇటీవలే మాస్ వ్యాక్సినేషన్ కూడా ప్రారంభించింది. ఇందులో భాగంగా దేశంలోని 70 క్లినిక్స్‌లో మొదట వైద్యులు,ఆరోగ్య కార్యకర్తలు,టీచర్స్,సామాజిక కార్యకర్తలకు వ్యాక్సిన్ అందిస్తున్నారు.

భారీ ఎత్తున ఉత్పత్తికి భారత్‌తో ఒప్పందం...

భారీ ఎత్తున ఉత్పత్తికి భారత్‌తో ఒప్పందం...

ఈ ఏడాది చివరి నాటికి 2మిలియన్ల డోసుల వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయాలని భావిస్తోంది. వ్యాక్సిన్‌ను భారీ ఎత్తున ఉత్పత్తి చేసేందుకు భారత్‌లోని డా.రెడ్డీస్ ఫార్మా కంపెనీతోనూ రష్యా ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం డా.రెడ్డీస్ స్పుత్నిక్ వికి సంబంధించి రెండో దశ,మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుపుతుంది. ఈ వ్యాక్సిన్‌ భారత డ్రగ్ రెగ్యులేటరీ సంస్థల అనుమతులు పొందితే... 10 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను రష్యా డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) డా.రెడ్డీస్‌కు సరఫరా చేయనుంది.

రష్యా బాటలో ఫైజర్..

రష్యా బాటలో ఫైజర్..

రష్యా బాటలోనే ఇటీవల బ్రిటన్ కూడా ఎమర్జెన్సీ వినియోగం కోసం ఫైజర్-బయోఎన్‌టెక్ అభివృద్ధి చేసిన కరోనావైరస్ వ్యాక్సిన్‌కి అనుమతులిచ్చింది. ప్రపంచంలో ఈ వ్యాక్సిన్‌ను ఆమోదించిన తొలి దేశం బ్రిటన్ కావడం గమనార్హం. కోవిడ్ -19ను ఎదుర్కోవడంలో ఈ వ్యాక్సిన్ 95 శాతం సమర్థవంతంగా, ఇది సురక్షితంగా పనిచేస్తోందని బ్రిటన్ రెగ్యులేటరీ సంస్థ ఎంహెచ్ఆర్ఏ వెల్లడించింది.బ్రిటన్ ప్రభుత్వం ఇప్పటికే 4 కోట్ల డోసులకు ఆర్డర్ చేసింది. ఇది 2 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు సరిపోతుంది. త్వరలోనే మరో కోటి డోసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

English summary
President Vladimir Putin in August announced Russia as the first country to grant regulatory approval to Covid-19 vaccine named 'Sputnik V', raising concern among vaccine experts who felt the government has cut corners and may put citizens at risk.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X