వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యెమన్: అడెన్ ఎయిర్ పోర్టులో భారీ పేలుడు -ఇప్పటికే 26 మంది మృతి -తృటిలో మంత్రులు ఎస్కేప్

|
Google Oneindia TeluguNews

పశ్చిమాసియాలోని రెండో అతిపెద్ద అరబ్ దేశం యెమన్ లో కనీవినీ ఎరుగని భీతావాహ పరిస్థితులు నెలకొన్నాయి. యెమన్ రవాణా రంగానికి రాజధానిలాంటి అడెన్ సిటీలో గల ఎయిర్ పోర్టులో బుధవారం భయానక పేలుడు చోటుచేసుకుంది. కొత్తగా ఎన్నికైన ప్రభుత్వ ప్రతినిధులు విమానం దిగిన కొద్ది సేపటికే ఎయిర్ పోర్టులో భారీ పేలుడు సంభవించింది..

బీహార్: నితీశ్ సర్కారుకు గండం -ఆర్జేడీలోకి 17మంది జేడీయూ ఎమ్మెల్యేలు! -సీఎం ఘాటు రియాక్షన్ అరుణాచల్ ప్రదేశ్ లోబీహార్: నితీశ్ సర్కారుకు గండం -ఆర్జేడీలోకి 17మంది జేడీయూ ఎమ్మెల్యేలు! -సీఎం ఘాటు రియాక్షన్ అరుణాచల్ ప్రదేశ్ లో

 26 మంది మృతి..

26 మంది మృతి..

యెమెన్ లోని అడెన్ ఎయిర్ పోర్టులో జరిగిన పేలుడులో ఇప్పటివకు 26 మంది చనిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. భారీ పేలుడు ధాటికి ఎయిర్ పోర్టు ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. జనం హాహాకారాలు పెడుతూ భయంతో బయటికి పరుగులు తీస్తోన్న దృశ్యాలు కలకలం రేపాయి. కాగా,

ప్రధాని మోయిన్ ప్రకటన..

ప్రధాని మోయిన్ ప్రకటన..

ఎయిర్ పోర్టులో చోటుచేసుకున్న పేలుడులో కొత్త ప్రభుత్వంలోని మంత్రులెవరూ గాయపడలేదని, విమానంలో వచ్చిన అందరికి అందరూ సేఫ్ గా ఉన్నారని యెమెన్ ప్రధాని మోయిన్ అబ్దుల్ మాలిక్, సమాచార శాఖ మంత్రి మోమ్మార్ అల్ ఎర్యానీ మీడియాకు తెలిపారు. టెర్రరిస్టుల ఘాతుక చర్యను ప్రధాని ఖండించారు. ఎయిర్ పోర్టుపై దాడిని డ్రోన్ల ద్వారా నిర్వహించి ఉంటారనే అనుమానాలు వెల్లువెత్తాయి. పేలుడు తర్వాత కాలపులు కూడా చోటుచేసుకున్నట్లు ఇంకొందరు చెప్పారు. అయితే పేలుడు ఎలా జరిగిందనేదానిపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు...

 హుతీ రెబల్స్ పనే ఇదే..

హుతీ రెబల్స్ పనే ఇదే..

యెమన్ లో కొంత కాలంగా హుతీ రెబల్స్ కు, ప్రభుత్వానికి మధ్య యుద్ధం నడుస్తోంది. హుతీ రెబల్స్ కు ఇరాన్ మద్దతు ఇస్తుండటంతో భారీగా ఆయుధాలతో రెబల్స్ ఇప్పటికే దేశంలోని చాలా ప్రాంతాలను ఆక్రమించారు. అతిపెద్ద నగరం సనాను కూడా రెబల్స్ తమ స్వాధీనం చేసుకున్నారు. తాజాగా అడెన్ ఎయిర్ పోర్టు పేలుడు కూడా వారి పనే అని, దీని వెనుక కూడా ఇరాన్ హస్తం ఉండొచ్చని యెమన్ ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తున్నారు. ఇటీవల..

కొత్త మంత్రులు ఎస్కేప్..

కొత్త మంత్రులు ఎస్కేప్..

హుతీ రెబల్స్ క్రమంగా పట్టు బిగిస్తుండటంతో వారిని నిలువరించేలా.. దక్షిణ ప్రాంతంలోని రెబల్ గ్రూపులను కలుపుకొని డిసెంబర్ 18న కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ ప్రభుత్వంలో కొత్తగా మంత్రి పదవులు పొందిన వారంతా బుధవారం విమానంలో అడెన్ సిటీకి రాగా.. ఆ సమయంలోనే ఎయిర్ పోర్టులో పేలుడు సంభవించింది. అయితే వారంతా తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.

తిరుపతిలో ఘోరం: భార్య అందాలే పెట్టుబడిగా భర్త వ్యాపారం -ఓయో రూమ్‌లో గంటకు రూ.3వేలంటూతిరుపతిలో ఘోరం: భార్య అందాలే పెట్టుబడిగా భర్త వ్యాపారం -ఓయో రూమ్‌లో గంటకు రూ.3వేలంటూ

English summary
At least 26 people were killed and more than 50 people were wounded in an attack on Yemen’s Aden airport on Wednesday, according to local authorities. The incident happened shortly after a plane carrying the newly formed and internationally recognized Yemeni governmentarrived from Saudi Arabia. Loud blasts and gunfire were heard at the airport after the plane landed in Yemen's temporary capital, witnesses said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X