Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

డ్రోన్లతో చమురు క్షేత్రాలపై దాడి.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు ....

దుబాయ్ : సౌదీ అరేబియాలో యెమన్ హౌతి తిరుగబాటుదారులు మరోసారి రెచ్చిపోయారు. సౌదీకి చెందిన సౌదీ అరామికో ప్రధాన చమురు క్షేత్రంపై డ్రోన్లతో విరుచుకుపడ్డారు. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా అనే అంశంపై క్లారిటీ లేదు. కింగ్ డమ్, బుక్వాక్, ఖురైస్ చమురుక్షేత్రాల్లో ప్రమాదంలో గాయపడ్డ వారి వివరాలు తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు.

 Yemen rebels claim drone attacks on Saudi oilfield

చమురు క్షేత్రంపై డ్రోన్లతో దాడులు చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరాన్‌పై ఇప్పటికే పీకలలోతు కోపంలో ఉన్న అమెరికా .. తాజా దాడితో అప్రమత్తమైంది. హౌతి ఉగ్రవాదులు మాత్రం టెహ్రన్ కు మద్దతిస్తున్నారు. చమురు క్షేత్రంలో దాడికి సంబంధించి ఆన్ లైన్ లో కూడా వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. మంటలతో పొగ ఆకాశాన్నాంటింది. చమురు క్షేత్రాలపై డ్రోన్లతో దాడి చేశారని సౌదీ అరేబియా వర్గాలు కూడా ధ్రువీకరించాయి. చమురు క్షేత్రాలపై జరిపిన దాడిపై విచారణ జరుగుతుందని సౌదీ విదేశాంగ మంత్రి ఒకరు ప్రకటనలో తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+