Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Nimisha Priya: యెమెన్‌లో కేరళ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష వాయిదా

Nimisha Priya: యెమెన్‌లో కేరళ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష వాయిదా వేసినట్లు సమాచారం అందింది. నిమిష ఉరిశిక్ష అమలు వాయిదా వేస్తూ యెమెన్ కీలక నిర్ణయం తీసుకుంది. నిమిష ప్రియను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. యెమెన్ ప్రభుత్వంతో భారత సర్కార్ చర్చలు జరుపుతోంది. ఆమెకకు జులై 16న యెమెన్ లో ఉరిశిక్ష అమలు కావాల్సి ఉంది. చివరి క్షణంలో దీనిని నిలిపివేసినట్లు సమాచారం.

చివరి నిమిషంలో బాధిత కుటుంబంతో భారత్ కు చెందిన మత పెద్దల చర్చల నేపథ్యంలో మరణ శిక్ష వాయిదా పడినట్లు సమాచారం. కేరళ నర్సు నిమిష ప్రియ శిక్ష వాయిదా పడ్డ విషయాన్ని యెమెన్‌లో "సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్" సభ్యుడు శామ్యూల్ జోరెమ్ భాస్కరన్ ధ్రువీకరించారు. కానీ బాధిత కుటుంబం బ్లడ్ మనీకి గానీ, శిక్ష రద్దుకు గానీ అంగీకరించలేదని ఆయన వెల్లడించారు. చర్చల్లో ఇంగా పురోగతి రావాల్సి ఉందని పేర్కొన్నారు. కేరళ రాష్ట్రానికి చెందిన గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియాగా పేరున్న కేరళ ముస్లిం నేత అబుబాకర్ ముస్లియార్, షేఖ్ హబీబ్ ఉమర్ వంటి మత గురువులు రంగంలోకి దిగి క్షమాభిక్ష కోసం రాయబారం జరుపుతున్నారు. తలాల్ అబ్దో మెహదీ కుటుంబంతో మత పెద్దలు యెమెన్ లో అత్యవసర భేటీ అయినట్లు సమాచారం. ఈ క్రమంలో ఉరిశిక్ష వాయిదా పడడం గమనార్హం. మరో వైపు నిమిష ప్రియ విషయంలో భారత ప్రభుత్వం ప్రయత్నాలు కూడా ఫలిస్తున్నట్లు తెలుస్తోంది.

నిమిష ప్రియకు హత్య కేసులో మరణ శిక్ష విధించబడిన సంగతి తెలిసిందే. ఆమె 2017 నుంచి యెమెన్ జైలులో ఉన్నారు. మెమెనీ పౌరుడు తలాల్ అబ్టో మెహదీ హత్యకు నిమిష దోషిగా తేలింది. మెహదీ వద్ద తన పాస్‌పోర్టును పొందడానికి ఆయనకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చిందని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఇంజెక్షన్ల డోస్ ఎక్కువ కావడంతో మెహదీ మరణించారు.

Yemeni Court Delays Execution of Kerala Nurse Nimisha Priya

కేరళలోని పాలక్కాడ్ కు చెందిన నర్సు నిమిషా తన భర్త మరియు కూతురితో కలిసి గత దశాబ్ద కాలంగా యెమెన్‌లో పని చేస్తున్నారు. 2016లో యెమెన్‌లో జరిగిన అంతర్యుద్ధం కారణంగా దేశం నుండి రాకపోకలపై ఆంక్షలు విధించారు. అయితే, అంతకుముందు 2014లోనే ఆమె భర్త, కూతురు భారత్‌కు తిరిగి వచ్చేశారు.కానీ నిమిష ప్రియ తిరిగి రాలేకపోయింది. ఆ తర్వాత జూలై 2017లో ఒక యెమెనీ పౌరుడి హత్య కేసులో ఈ నర్సుపై అభియోగాలు మోపారు. 2018 మార్చి 7న యెమెన్‌లోని న్యాయస్థానం నిమిషా మరణశిక్షను సమర్థించింది.

ఏ చట్టం కింద నిమిష ప్రియకు శిక్ష విధించబడింది?
యెమెన్‌లో షరియా చట్టం అమలవుతుంది. ఈ చట్టం కింద హత్య కేసులలో మరణశిక్ష విధించబడుతుంది. బ్లడ్ మనీ అనేది ఒక పద్ధతి, దీనిలో హత్య చేసిన వ్యక్తికి క్షమాపణ ఇవ్వబడుతుంది. అయితే ఆ వ్యక్తి మృతుని కుటుంబానికి పరిహారంగా పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాలి. ఈ మొత్తం మృతుని బంధువులతో ఒప్పందం ద్వారా నిర్ణయించబడుతుంది.నిమిష ప్రియకు యెమెన్‌లో మరణశిక్ష విధించినప్పటి నుండి, బ్లడ్ మనీ చెల్లించి ఆమెను విడిపించే విషయం చర్చలో ఉంది. ఇస్లాం పండితులు ఈ పద్ధతిని క్షమించడానికి అవకాశాన్ని మాత్రమే కాకుండా, ఆర్థిక మద్దతు ద్వారా బాధితుడి కుటుంబానికి కొంతవరకు న్యాయం కూడా చేస్తుందని నమ్ముతారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+