వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెద్ద దెబ్బ: రూ.4,879 కోట్ల రెవిన్యూను కోల్పోతున్న గూగుల్, కారణమిదే?

మార్కెట్లో దిగ్గజ కన్య్జూమర్ బ్రాండ్ కంపెనీలన్నీ దాదాపుగా వీడియో హౌస్టింగ్ ఫ్లాట్ ఫామ్ యూట్యూబ్ ను బ్లాక్ చేశాయి.దీంతో సుమారు 4,879 కోట్లను గూగుల్ కోల్పోతోందని మీడియా నివేదికలు చెబుతున్నాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్:మార్కెట్లో దిగ్గజ కన్య్జూమర్ బ్రాండ్ కంపెనీలన్నీ దాదాపుగా వీడియో హౌస్టింగ్ ఫ్లాట్ ఫామ్ యూట్యూబ్ ను బ్లాక్ చేశాయి.దీంతో సుమారు 4,879 కోట్లను గూగుల్ కోల్పోతోందని మీడియా నివేదికలు చెబుతున్నాయి.

అభ్యంతరకర వీడియోల వద్ద తమ ప్రకటనలను ప్రచురిస్తున్నారనే కారణంగా యూట్యూబ్ కు ప్రకటనలను ఇవ్వమని తేల్చేశాయి ఆ కంపెనీలు. దీంతో యూట్యూబ్ పేరెంట్ కంపెనీ గూగుల్ కు పెద్ద దెబ్బతగిలే అవకాశం ఉంది.

youTube ad boycott may cost google $750 million in revenue

ఈ ప్రకటనలను కోల్పోవడం వల్ల రూ.4,879 కోట్లను గూగుల్ కోల్పోయే అవకాశం ఉందని మీడియానివేదికలు చెబుతున్నాయి. కొన్నివారాలుగా కన్య్జూమర్ బ్రాండ్ దిగ్గజాలైన జాన్సన్ అండ్ జాన్సన్ , పెప్సీకో, మెక్ డొనాల్డ్ కంపెనీలు తమ వ్యాపార ప్రకటనలు యూట్యూబ్ ప్లాట్ ఫామ్ నుండి ఉపసంహరించుకొంటున్నాయి.

వీటితో పాటు పలు టెలికం కంపెనీలు ప్రముఖ కంపెనీలు యూట్యూబ్ కు ప్రకటనలు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకొన్నాయి. టెర్రరిజానికి సంబంధించిన గ్రూపులు పోస్టు చేసే వీడియోల దగ్గర తమ వ్యాపార ప్రకటనలను యూట్యూబ్ ఇస్తోందని కంపెనీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఈ సమస్యను పరిష్కరిస్తామని గూగుల్ చెప్పినప్పటికీ దీనిపై ఆందోళన కొనసాగుతూనే ఉంది. దీంతో సెర్చింజన్ దిగ్గజం గూగుల్ షేర్ ధర అంతర్జాతీయంగా పడిపోతోంది.

ఈ సమస్యను గూగుల్ వెంటనే పరిష్కరించాలని లేకుంటే భారీ మూల్యాన్ని కంపెనీ మూటగట్టుకోవాల్సి ఉంటుందని బ్రోకరిజ్ సంస్థ నోముర ఇన్ ప్టినెట్ చెబుతోంది. యూట్యూబ్ వార్షిక రెవిన్యూలు ఈ ఏడాది 10.2 మిలియన్ డాలర్లు (రూ.66,346 కోట్లు) పైనే ఉంటుందని అంచనాలు ఉన్నాయి. కానీ, ఈ వివాదంతో 7.5 శాతం మేర రెవిన్యూను కోల్పోవాల్సి వస్తోందని నోమురా హెచ్చరిస్తోంది.

English summary
the boycott of video-hosting platform YouTube by advertisers could cost its parent company Google $750 million (roughly Rs. 4,879 crores) in revenue, a media report said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X