వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూట్యూబ్ పుట్టిందిలా: ఎన్నో ఆసక్తికర విషయాలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

మానవ చరిత్రలో సరికొత్త విప్లవానికి ఇంటర్నెట్ నాంది పలికింది. అలాంటి ఇంటర్నెట్‌ ద్వారా ఎన్నో అద్భుతాలు ఆవిష్కరించబడ్డాయి. ఈ కోవలోకి చెందినదే యూట్యూబ్. ప్రపంచంలోనే ఎక్కువ వీడియోలను కలిగి ఉన్న వీడియో భాండాగారంగా యూట్యూబ్ నిలిచింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆదరణను చూరగొన్న యూట్యూబ్ ఎలా పుట్టిందో తెలుకుంటే ఆశ్చర్యపడాల్సిందే. నిజానికి యూట్యూబ్‌ను మొట్టమొదట వీడియోల కోసం ప్రారంభించలేదు. కేవలం ఓ డేటింగ్ వెబ్‌సైట్‌గా రూపొందించారు. అయితే చివరకు అది ఇప్పుడున్న యూట్యూబ్‌గా మారింది.

యూట్యూబ్ పుట్టుపూర్వోత్రాలను ఒకసారి పరిశీలిస్తే, యూట్యూబ్‌ను 2005లో చాడ్‌ హుర్లే.. స్టీవ్‌ చెన్‌.. జావేద్‌ కరీం స్థాపించారు. ఇంటర్నెట్ ప్రపంచంలో అప్పుడే కొత్తగా వచ్చిన పేపాల్ కంపెనీలో ఈ ముగ్గురు పని చేసేవారు. స్టీవ్‌ చెన్‌ మొదట ఓ డేటింగ్‌ వెబ్‌సైట్‌ను ప్రాంభించాలని అనుకున్నాడు.

ఈ క్రమంలో కాబోయే జీవిత భాగస్వాములు ఒకరినొకరు పరిచయం చేసుకునేందుకు ఉపయోగపడేలా సమాచారాన్ని కేవలం లెటర్స్ రూపంలో కాకుండా, భిన్నంగా ఉండాలనే ఉద్దేశంతో వీడియో ద్వారా వ్యక్తిగత వివరాలను రికార్డు చేసి ప్రోఫైల్‌లో అప్‌లోడ్‌ చేసేలా రూపొందించాడు.

యూట్యూబ్‌ను ప్రారంభించి ఐదు రోజులు గడుస్తూన్న ఏ ఒక్కరూ వీడియోను అప్‌లోడ్ చేయలేదు. ప్రస్తుతం ఉన్న యూట్యూబ్‌కు ప్రేరణకు రెండు సంఘటలను ఉపయోగపడ్డాయని కరీం ఒకానొక సందర్భంలో తెలిపారు. జానెట్ జాక్సన్‌కు వీరాభిమాని అయిన కరీం ఆమెకు సంబంధించిన ఓ 'వార్డ్‌రోబ్ మాల్ ఫంక్షన్' పుటేజీని ఆన్‌లైన్‌లో కనుగొనేందుకు విఫలమవడం.

 యూట్యూబ్ పుట్టిందిలా: ఎన్నో ఆసక్తికర విషయాలు

యూట్యూబ్ పుట్టిందిలా: ఎన్నో ఆసక్తికర విషయాలు


ఇక రెండోది ఒకరోజు స్టీవ్ చెన్‌ తన స్నేహితుల కోసం పార్టీని ఏర్పాటు చేశాడు. అయితే ఈ పార్టీకి తన స్నేహితుడైన కరీంను కూడా ఆహ్వానించాడు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల కరీం పార్టీకి రాలేదు. ఆ మరుసటి రోజు చెన్ పార్టీ చేసుకున్నామని కరీంకు చెప్పినా అతడు నమ్మలేదు.

యూట్యూబ్ పుట్టిందిలా: ఎన్నో ఆసక్తికర విషయాలు

యూట్యూబ్ పుట్టిందిలా: ఎన్నో ఆసక్తికర విషయాలు


అంతేకాదు పార్టీ చేసుకుంటే పార్టీకి సంబంధించిన వీడియోలను చూపించాలని అడిగాడు. దీంతో తమ వెబ్‌సైట్‌లో కేవలం భాగస్వాముల వ్యక్తిగత సమాచారంతో పాటు వీడియోలను కూడా అప్‌లోడ్ చేసే సౌకర్యాన్ని కల్పిస్తే బాగుంటుందని ఆ సదుపాయాన్ని కల్పించారు.

 యూట్యూబ్ పుట్టిందిలా: ఎన్నో ఆసక్తికర విషయాలు

యూట్యూబ్ పుట్టిందిలా: ఎన్నో ఆసక్తికర విషయాలు


దీంతో ఎవరైనా సరే యూట్యూబ్‌లో రిజిస్టర్ అయి వీడియోలను అప్‌లోడ్ చేసి వీక్షించే వెబ్‌సైట్‌గా మార్చేశారు. యూట్యూబ్‌లో అధికారికంగా అప్‌లోడ్ అయిన మొట్టమొదటి వీడియో అప్‌లోడ్ చేసింది మాత్రం కరీం. శాన్ డియోగో జూలో ఓ ఏనుగు ముందు నుంచుని వాటి దంతాల గురించి వివరించే వీడియో.

 యూట్యూబ్ పుట్టిందిలా: ఎన్నో ఆసక్తికర విషయాలు

యూట్యూబ్ పుట్టిందిలా: ఎన్నో ఆసక్తికర విషయాలు


ఆ తర్వాత యూట్యూబ్‌కు అనుగుణంగా పేపాల్ లోగోను డిజైన్ చేశారు. నవంబర్ 2006లో యూట్యూబ్‌ను సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ 1.65 అమెరికన్ బిలియన్లకు కొనుగోలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతోంది.

English summary
The average YouTube user spends between 15 and 25 minutes a day on the site, but how much do we know about the world's largest video sharing website?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X