ఘోర విమాన ప్రమాదం: భారతీయ బిలియనీర్, ఆయన కొడుకు సహా ఆరుగురు మృతి
హరారే: జింబాబ్వే (Zimbabwe)లో ఘోర విమాన ప్రామదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, ఆయన కుమారుడితో సహా ఆరుగురు మృతి చెందారు. భారతదేశానికి చెందిన ప్రముక వ్యాపారవేత్త, బిలియనీర్ హర్పాల్ రంధావా (Harpal Randhawa)) జింబాబ్వేలో రియోజిమ్ పేరుతో మైనింగ్ కంపెనీ నిర్వహిస్తున్నారు.
ఈ కంపెనీ బంగారం, బొగ్గును ఉత్పత్తి చేయడంతోపాటు నికెల్, రాగిని శుద్ధి చేస్తుంది. శుక్రవారం హర్పాల్ రంధావా, ఆయన కుమారుడుమరో నలుగురు సిబ్బందితో కలిసి జింబాబ్వేలోని హరారే నుంచి మురోవాలోని మైనింగ్ ప్రాంతానికి కంపెనీకి చెందిన సెస్నా 206 విమానంలో బయల్దేరారు.

విమానం ముషావా ప్రాంతానికి చేరుకున్న తర్వాత సాంకేతిక లోపంతో కూలిపోయిందని వైమానిక వర్గాలు తెలిపాయి. ఈ విమాన ప్రమాదంలో అందులోని వారంతా మృతి చెందారని వెల్లడించారు. విమాన ప్రమాద వార్తలను రియోజిమ్ కంపెనీ అధికారికంగా ధృవీకరించింది.
ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు సంబంధిత అధికారులతో కలిసి పని చేస్తున్నట్లు తెలిపింది. ప్రమాదంలో మరణించినవారి వారి పేర్లను మాత్రం జింబాబ్వే పోలీసులు వెల్లడించలేదు. హర్పాల్ స్నేహితుడు, నిర్మాత హౌప్‌వెల్ చినోనో ఆయన మృతిని ధృవీకరించారు. దీనిపై త్వరగా ప్రకటన విడుదల చేస్తామని రియోజిమ్ ప్రతినిధి వెల్లడించారు.












Click it and Unblock the Notifications