హార్ముజ్ లో జాంబీ షిప్ ? ఐదేళ్ల క్రితం మాయమై.. ఇప్పుడు మళ్లీ ప్రత్యక్ష్యం..!
ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ చేస్తున్న డాడులు, వాటికి ప్రతిగా ఇరాన్ సాగిస్తున్న దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. అదే సమయంలో ఇరాన్ పొరుగున ఉన్న హార్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ చమురు నౌకల్ని వెళ్లనీయకుంండా అడ్డుకుంటున్న తీరు ప్రపంచ దేశాల్ని సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తోంది. ఇలాంటి సమయంలో అదే హార్ముజ్ జలసంధిలో ప్రత్యక్షమైన ఓ జాంబీ షిప్ (Zombie Ship) కలకలం రేపుతోంది. దీని వెనుక ఓ షాకింగ్ కారణం ఉంది.
ఐదేళ్ల క్రితమే తుక్కు కింద జమ చేసినట్లు భావించిన ఒక ఆయిల్ ట్యాంకర్ తాజాగా హార్ముజ్ జలసంధిని దాటింది. ఇటీవల కాలంలో ఇలాంటి జాంబీ నౌక ప్రయాణం ఇది రెండోసారి. నబీన్ పేరుతో ఉన్నట్లుగా గుర్తించిన ఈ నౌక, ట్రాకింగ్ డేటా ప్రకారం ఆదివారం సాయంత్రం పర్షియన్ గల్ఫ్‌లో, సోమవారం ఉదయం ఒమన్ గల్ఫ్‌లో కనిపించింది. బ్లూమ్‌బెర్గ్ న్యూస్ రికార్డుల ప్రకారం 2002లో నిర్మించిన ఈ ఆఫ్రమాక్స్ ట్యాంకర్ ఐదేళ్ల క్రితం బంగ్లాదేశ్‌లోని నౌకా విచ్ఛిన్నం చేసే యార్డులకు పంపారు.

నబీన్ పేరుతో ప్రయాణిస్తున్న ఈ నౌకను “జాంబీ ట్యాంకర్”గా భావిస్తున్నారు. ఇది తుక్కు కింద జమ చేసిన, చట్టబద్ధమైన నౌక గుర్తింపును ఉపయోగిస్తుంది. గత సంవత్సరం భారతీయ విచ్ఛిన్నం చేసే యార్డులో నిలిచిపోయినట్లు నమోదైన ద్రవ సహజ వాయువు వాహన నౌక 'జమాల్’ సైతం శుక్రవారం జలసంధిని దాటింది. ఈ అసాధారణ ప్రయాణాలు వెనుక బలమైన కారణం ఉంది. పశ్చిమ ఆసియాలో ఫిబ్రవరి చివరిలో యుద్ధం మొదలైనప్పటి నుండి హార్ముజ్ జలసంధి దాదాపు మూసివేశారు. ఈ మార్గాన్ని తెరవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు రెండు రోజుల గడువు విధించారు. లేదంటే ఆ దేశంలోని విద్యుత్ ప్లాంట్లపై దాడులు చేస్తామని హెచ్చరించారు. అలాంటి దాడులు జరిగితే జలసంధిని పూర్తిగా మూసివేస్తామని టెహ్రాన్ ప్రతి హెచ్చరిక జారీ చేసింది.

దీంతో ఇప్పటివరకు అనుమతి పొందిన నౌకలు, ఇరాన్‌తో సంబంధం ఉన్నవి లేదా టెహ్రాన్ నుండి ఆమోదం పొందినవి మాత్రమే ఇందులో ప్రయాణిస్తున్నాయి. కానీ ఈ నబీన్ మాత్రం యుద్ధం ప్రారంభం కాకముందే గల్ఫ్‌లోకి ప్రవేశించిందని డేటా చెబుతోంది. ఇరాక్‌లోని ఖోర్ అల్ జుబైర్‌ను తన గమ్యస్థానంగా పేర్కొంది. భారీ ఎలక్ట్రానిక్ జోక్యం వల్ల దాని ఖచ్చితమైన కదలికలు అస్పష్టంగా ఉన్నప్పటికీ, గల్ఫ్‌లోకి బయలుదేరాక, నౌక పూర్తిగా నిండినట్లు కనిపించినా, దాని గమ్యస్థానాన్ని స్పష్టంగా పేర్కొనలేదు. దుబాయ్ కేంద్రంగా పనిచేసే ముహిత్ మారిటైమ్, సాగట్టా మారిటైమ్ కో లిమిటెడ్ నౌకకు నిర్వాహకుడిగా, యజమానిగా ఈక్వాసిస్ డేటాబేస్‌లో నమోదై ఉన్నాయి. ఈ రెండు సంస్థల అడ్రస్ లు ఒకటే కావడంతో వీటిపై చర్చ జరుగుతోంది.
-
మరో రెండు రోజుల్లో ఏదైనా జరగొచ్చు: ట్రంప్ కీలక ప్రకటన -
మే ఐ కమిన్: యుద్ధంలోకి డ్రాగన్ ఎంట్రీ.. ఇప్పుడే అసలు మజా..?? -
అమెరికా vs ఇరాన్: మళ్లీ చర్చలకు సన్నద్దమవుతున్న దాయాదులు! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications