ఇదే ఫస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్: నన్ను బ్లేమ్ చేయొద్దు: ఎవ్వర్నీ వదలను: ఓవర్ నైట్ విలన్
దుబాయ్: రవిచంద్రన్ అశ్విన్..ఈ ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ కేపిటల్స్ తరఫున ఆడుతోన్న ఈ వెటరన్ స్పిన్నర్ ఓవర్ నైట్ విలన్‌గా పేరు తెచ్చుకున్నాడు. గత ఏడాది ఐపీఎల్ సీజన్‌లో చోటు చేసుకున్న ఓ ఘటన అతణ్ని రాత్రికి రాత్రి విలన్‌గా మార్చివేసింది. గ్రౌండ్‌లో దిగిన తరువాత స్పోర్టివ్‌నెస్ మరిచిపోతాడనే అపవాదు అపాదించింది. ఒకే ఒక్క మన్కడింగ్ రవిచంద్రన్ అశ్విన్‌కు చెడ్డపేరును తీసుకొచ్చింది. అశ్విన్ బౌలింగ్‌కు దిగాడంటే..నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ కుదురుగా క్రీజ్‌లో ఉండాల్సిన పరిస్థితిని కల్పించింది. ఈ సీజన్ మొత్తానికీ అశ్విన్ బౌలింగ్‌కు దిగుతున్నాడంటే నాన్ స్ట్రైకింగ్ ఎండ్ బ్యాట్స్‌మెన్ ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే.
డేంజరస్ బీమర్: ఒకే బౌలర్ నుంచి రెండుసార్లు: ప్రమాదకరంగా: బ్యాట్స్‌మెన్ కట్టడికి వ్యూహమా?

అశ్విన్ మన్కడింగ్‌కు బట్లర్ బలి..
గత ఏడాది ఐపీఎల్ సీజన్‌లో అశ్విన్ మన్కడింగ్‌కు రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ బలి అయ్యాడు. 2019 ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున ఆడిన అతను.. బట్లర్‌ను మప్కడింగ్ విధానంలో అవుట్ చేయడం విమర్శలకు దారి తీసింది. 43 బంతుల్లో 69 పరుగులు చేసిన జోరు మీదున్న బట్లర్‌ను మన్కడింగ్ చేశాడు అశ్విన్. అశ్విన్ బౌలింగ్ చేస్తోన్న సమయంలో నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న బట్లర్ క్రీజ్‌ను వదిలి కాస్త బయటికి వెళ్లాడు. దీనితో.. బ్యాట్స్‌మెన్‌కు బంతిని సంధించకుండానే.. నాన్ స్ట్రైకింగ్ వికెట్లను బంతిని తాకించాడు. దీనితో బట్లర్ అవుట్ అయ్యాడు.
మరోసారి అలాంటి అవకాశమే..
మరోసారి రవిచంద్రన్ అశ్విన్‌కు అలాంటి అవకాశమే వచ్చింది. దాన్ని వినియోగించుకోలేదు. మన్కడింగ్ చేయలేదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ కేపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా అశ్విన్‌కు ఈ ఛాన్స్ దక్కింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ బ్యాటింగ్‌కు దిగినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ కేపిటల్స్ విధించిన లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బ్యాట్స్‌మెన్ ఆరోన్ ఫించ్.. అశ్విన్ బౌలింగ్ చేస్తోన్న సమయంలో నాన్ స్ట్రైకింగ్ ఎండ్ నుంచి బయటకి వెళ్లాడు. దాన్ని గమనించిన అశ్విన్.. బాల్‌ను విసరకుండా ఆగిపోయాడు. అలాగనీ- దాన్ని వికెట్లకు తాకించే ప్రయత్నం చేయలేదు. మన్కడింగ్ ద్వారా ఫించ్‌ను అవుట్ చేయలేదు. వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు.

అక్కడితో ఆగలేదు అశ్విన్..
మన్కడింగ్ చేయకుండా ఫించ్‌కు వార్నింగ్ ఇవ్వడంతోనే ఆగిపోలేదు అశ్విన్. తన ట్విట్టర్‌కు పని చెప్పాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఓ ట్వీట్ చేశాడు. బ్యాట్స్‌మెన్లందరికీ వార్నింగ్ పంపించాడు. ఆరోన్ ఫించ్‌కు అవుట్ చేయకుండా వార్నింగ్‌తోనే వదిలేశానని గుర్తు చేశాడు. ఐపీఎల్-2020 సీజన్‌కు ఇదే ఫస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని చెప్పాడు. అనంతరం జరిగే పరిణామాలకు తనను బ్లేమ్ చేయొద్దనీ చెప్పాడు. ఈ విషయాన్ని తాను అధికారికంగా ప్రకటిస్తున్నానని వెల్లడించాడు. ఇకముందు- తాను బౌలింగ్ చేస్తోన్న సమయంలో నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ క్రీజ్‌ను వదిలితే.. అవుట్ చేస్తాననే హెచ్చరికలను పరోక్షంగా పంపించాడు.