IPL 2020: Match 3: బెంగళూరు వర్సెస్ హైదరాబాద్, కోహ్లీ, వార్నర్ ఢీ
దుబాయ్: సెప్టెంబర్ 21న తెలుగు క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ అబూదాబిలో జరగనుంది. ఇది ఈ ఐపీఎల్‌లో మూడో మ్యాచ్.. సోమవారం రాత్రి 7.30 గంటల నుంచి ప్రత్యక్షప్రసారం కానుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎప్పటిలాగే విరాట్ కోహ్లీ నేతృత్వంలో బలంగానే ఉంది. మైక్ హెసన్, సిమన్ కాటిచ్‌లు ఇప్పుడు ఈ జట్టుకు అదనపు బలంగా ఉన్నారు. 2011 నాటి నుంచి కెప్టెన్‌గా కోహ్లీ ఉన్నప్పటికీ.. ఒక్కసారి కూడా ఐపీఎల్ టోర్నీని గెలుచుకోలేకపోయింది. రోహిత్ శర్మ ఇప్పటి వరకు ముంబై జట్టుకు నాలుగుసార్లు ఐపీఎల్ ట్రోఫీని అందించాడు. ఈ నేపథ్యంలోనే ఈసారైనా ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకోవాలనే కసితో ఆడే అవకాశం ఉంది.

ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా అద్భుత ఆటగాడు డేవిడ్ వార్నర్ సారథ్యంలో బలంగానే కనిపిస్తోంది. కాగా, ఈ జట్టు ఎక్కువగా డేవిడ్ వార్నర్ పైనే ఆధారపడుతుంది. అయితే, అభిమానుల అంచనాలను ఎప్పుడూ వార్నర్ తక్కువ చేయడు. మిగితా ఆటగాళ్లు కూడా రాణిస్తే ఈ జట్టుకు టోర్నీలో తిరుగుండదనే చెప్పవచ్చు.
బెంగళూరు జట్టు: విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, ఆరోన్ ఫింఛ్, యుజ్వేందర్ ఛహల్, డేల్ స్టెయిన్, ఆడమ్ జంపా, క్రిస్ మోరీస్, దేవదత్ పడిక్కల్, గుర్కీరత్ సింగ్ మన్, ఇసురు ఉడాన, జోష్ ఫిలిప్పే, మొయిన్ అలీ, మొహమ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ, పార్థీవ్ పటేల్, పవన్ దేశ్ పాండే, పవన్ నేగి, శహబాజ్ అహ్మద్, శివ్ దూబే, ఉమేష్ యాదవ్, వాషింగ్టన్.
హైదరాబాద్ జట్టు: డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, మనీష్ పాండే, అబ్దుల్లా సమద్, అభిషేక్ శర్మ, బసిల్ తంపి, బవనక సందీప్, బిల్లీ స్నన్లేక్, ఫబియన్ అలెన్, జానీ బైర్ స్టో, ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్, మొహమ్మద్ నబీ, ప్రియం గార్గ్, సందీప్ శర్మ, సంజయ్ యాదవ్.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications