వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అగ్గి రాజేసిన లెజెండరీ స్పిన్నర్ బయోపిక్: తమిళుల మారణకాండకు: ఆ నటుడిపై గుండెలపై శ్రీలంక ఫ్లాగ్

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఓ బయోపిక్ మూవీ.. తమిళనాడులో అగ్గి రాజేసింది. అభిమానుల ఆగ్రహావేశాలకు కారణమైంది. తాము దైవంగా ఆరాధించే నటుడే అయినప్పటికీ.. రాష్ట్ర ప్రయోజనాల వద్దకు వచ్చే సరికి.. అభిమానాన్ని పక్కన పెట్టారు తమిళులు. తమిళ ప్రజలను ఊచకోత కోసిన దేశానికి చెందిన జాతీయ పతకాన్ని తమిళ నటుడు తన గుండెల మీద ధరించడాన్ని ఏ మాత్రం భరించలేకపోతున్నారు. షేమ్ అంటూ మండి పడుతున్నారు. ఈ బయోపిక్ నుంచి తప్పుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తమవారిని కనీసం మనుషులుగా కూడా గుర్తించని దేశానికి చెందిన జాతీయ పతాకాన్ని గుండెలపై ఎలా ధరిస్తారంటూ మండిపడుతున్నారు.

ధోనీ..సో కాల్డ్ లెజెండ్: ఒక్క ఘటనతో విలన్: పరువు పోయినట్టేనా? చెన్నై సూపర్ కింగ్స్ బ్యాన్ కోసంధోనీ..సో కాల్డ్ లెజెండ్: ఒక్క ఘటనతో విలన్: పరువు పోయినట్టేనా? చెన్నై సూపర్ కింగ్స్ బ్యాన్ కోసం

ఆ బయోపిక్..

ఆల్‌టైమ్ గ్రేట్ క్రికెటర్.. లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్రపై తీస్తోన్న మూవీ అది. దాని టైటిల్.. 800. ఇప్పట్లోనే కాదు.. భవిష్యత్తులో కూడా ఏ బౌలర్ కూడా 800 వికెట్ల మైలురాయిని చేరుకోలేకపోవచ్చు. బౌలర్లు కలలో కూడా ఊహించని ఆల్ టైమ్ రికార్డ్ అది. తన ముంజేతి మాయాజాలంతో దాన్ని సాధించాడు ముత్తయ్య మురళీధరన్. ఓ ఆటగాడిగా తమిళ ప్రజలు కూడా అతణ్ని ఎంతగానో అభిమానిస్తారు.. ఆరాధిస్తారు. ఓ సింహళ దేశస్తుడిగా మాత్రం అతణ్ని స్వాగతించలేరు. దానికి కారణం- శ్రీలంకలో చోటు చేసుకున్న తమిళుల మారణకాండ.

మురళీధరన్ పాత్రలో..

ఈ బయోపిక్‌లో ముత్తయ్య మురళీధరన్ పాత్రలో తమిళ టాప్ మాస్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్నారు. 800 పేరుతో ఈ మూవీ సెట్స్ మీదికి వెళ్లింది. దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్‌‌ను చిత్రం యూనిట్ విడుదల చేసింది. ముత్తయ్య మురళీధరన్ బాల్యం నుంచే స్పిన్ బౌలర్‌గా చూపించారు ఈ పోస్టర్‌లో. క్రికెట్‌లో అతను ఎదిగిన తీరును ప్రస్తావించారు. అదే సమయంలో- శ్రీలంకలో చోటు చేసుకున్న మారణహోమాన్ని, కల్లోల పరిస్థితులనూ వివరించారు. అలాంటి వాతావరణంలో పెరిగిన ఓ ఆటగాడు.. 800 వికెట్లను పడగొట్టే స్థాయికి ఎలా చేరుకున్నాడనేదే ఈ మూవీ స్టోరీ లైన్. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను ట్రైన్ మోషన్ పిక్చర్స్, దార్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

తమిళగడ్డపై అడుగు పెట్టనివ్వం..

ఈ బయోపిక్ మూవీని పూర్తి చేసినప్పటికీ.. తమ గడ్డ మీద ప్రదర్శించనివ్వబోమిన తమిళ అభిమానులు హెచ్చరిస్తున్నారు. తమవాళ్ల రక్తంతో తడిసిన శ్రీలంక జాతీయ పతాకాన్ని ఓ తమిళియనే ధరించడం దురహంకారంగా భావిస్తున్నామని అంటున్నారు. క్రీడాపరంగా తాము ఏనాడూ మురళీధరన్‌కు వ్యతిరేకంగా వ్యవహరించలేదని, తమ మనోభావాలను గాయపరిచేలా ఆయన బయోపిక్‌లో సన్నివేశాలు ఉండకూడదని డిమాండ్ చేస్తున్నారు. #ShameOnVijaySethupathi అని ట్రెండింగ్ చేస్తున్నారు. ఇక్కడ భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. సినిమాను సినిమాగా చూడాలనే అభిప్రాయాలు కూాడా వినిపిస్తున్నాయి. తమిళుల ఊచకోతతో ముడిపెట్టడం సరికాదనీ అంటున్నారు మరికొందరు నెటిజన్లు.

మురళీధరన్ ఏం చేస్తున్నారు?

ప్రస్తుతం మురళీధరన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉన్నారు. డేవిడ్ వార్నర్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాాబాద్ జట్టుకు బౌలింగ్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు. తన జట్టుతో పాటు ఆయన ఎమిరేట్స్‌లో ఉంటున్నారు. ఐపీఎల్ ప్రారంభమైన తొలి రోజుల్లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ తరఫున ఆడాడు. ఆ తరువాత రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఆయన భార్య మతీ మలార్ తమిళియనే. ఆమె చెన్నైలో నివసిస్తున్నారు. వృత్తిపరంగా డాక్టర్.

English summary
Tamil actor Vijay Sethupathi is all set to play the role of famed Sri Lankan spinner Muttiah Muralitharan. in the upcoming biopic, titled 800. After 800 motion poster launch, ShameOnVijaySethupathi started trending on Twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X