వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

RR vs KKR : కేకేఆర్‌తో ఫైట్... హ్యాట్రిక్‌పై కన్నేసిన రాజస్తాన్ రాయల్స్...

|
Google Oneindia TeluguNews

ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా బుధవారం(సెప్టెంబర్ 30) రాజస్తాన్ రాయల్స్-కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటివరకూ ఆడిన రెండు మ్యాచ్‌లలో నెగ్గి మెరుగైన రన్ రేటుతో రాజస్తాన్ జట్టు పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉండగా... ఆడిన రెండు మ్యాచ్‌లలో ఒకదాంట్లో ఓడిపోయి నెగటివ్ రన్ రేటుతో కేకేఆర్ కింది నుంచి రెండో స్థానంలో ఉంది.

రాజస్తాన్ ఆడిన రెండు మ్యాచ్‌లలో చెన్నై సూపర్ కింగ్స్,కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లను మట్టి కరిపించింది. చెన్నైతో మ్యాచ్‌లో 216 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించి విజయం సొంతం చేసుకుంది. పంజాబ్‌తో మ్యాచ్‌లో 223 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 19.3ఓవర్లలోనే చేధించింది. ఇలా మొదటి రెండు మ్యాచ్‌లలో భారీ స్కోర్లు నమోదు చేసిన రాజస్తాన్ మూడో మ్యాచ్‌లోనూ భారీ స్కోరుపై కన్నేసే అవకాశం ఉంది.

IPL 2020 rr Vs kkr Preview Rajasthan Eyeing Hat-Trick of Wins Play KKR on Wednesday

కేకేఆర్‌తో మ్యాచ్‌లో గెలిస్తే రాజస్తాన్ రాయల్స్ హ్యాట్రిక్ సాధించినట్లవుతుంది. సంజు శాంసన్,స్మిత్ ఫామ్‌లో ఉండటం రాజస్తాన్‌కు కలిసొచ్చే అంశం కాగా... బౌలింగ్ మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.

కేకేఆర్ జట్టు విషయానికొస్తే... ఈ సీజన్‌లో ఆడిన మొదటి మ్యాచ్‌లో ముంబై చేతిలో 49 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో కేకేఆర్ తరుపున శుభ్‌మణ్ గిల్,ఇయాన్‌ మోర్గాన్ మంచి ప్రదర్శన కనబర్చారు. రాజస్తాన్‌తో మ్యాచ్‌లోనూ ఈ ఇద్దరూ అదే ఫామ్‌ను కొనసాగిస్తారని టీమ్ భావిస్తోంది. సునీల్ నరైన్,నితీశ్ రానా,రస్సెల్ కూడా ఫామ్‌లోకి వస్తే కేకేఆర్‌కి తిరుగుండదు.

ఈ సీజన్‌లో మొదటిసారి ఈ రెండు జట్లు దుబాయ్ వేదికగా మ్యాచ్‌ ఆడబోతున్నాయి. ఇక్కడి కండిషన్స్‌కు బంతి అంతగా స్వింగ్ అవదని చెబుతున్నారు. ఇక్కడి బౌండరీలు కూడా కాస్త పెద్దగానే ఉంటాయి. కాబట్టి భారీ స్కోర్ సాధించడం అంత సులువేమీ కాదు. ఎక్కువసార్లు మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టునే ఇక్కడ విజయం వరించింది. దీనిపై సంజు శాంసన్ మాట్లాడుతూ.. వేదికకు తగ్గట్టుగా తమ గేమ్ ప్లాన్ ఉంటుందని... కేకేఆర్‌తో మ్యాచ్‌లోనూ తమదే విజయమని ధీమా వ్యక్తం చేశాడు.

English summary
This is the first time this season that both Kolkata Knight Riders and Rajasthan Royals will be playing here, having played only at Abu Dhabi and Sharjah respectively until now. The challenge will be steeper for Rajasthan for both their games have been on a ground with very small boundaries in comparison, and the key for them will be to adapt to the bigger ones that Dubai and Abu Dhabi will offer where the majority of their games will be played going forward.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X