వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

IPL 2021: వావ్ సంజూ వాట్ ఏ క్యాచ్.. మీరు చూసేయండి ఈ వీడియోను..!

|
Google Oneindia TeluguNews

ముంబై: రాజస్థాన్ రాయల్స్ నయా కెప్టెన్ సంజూ శాంసన్ తన మార్క్ వికెట్ కీపింగ్‌తో ఔరా అనిపించాడు. స్పైడర్ మ్యాన్‌లా గాల్లో తేలుతూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సంజూ వికెట్ల వెనుకాల తన ఫీల్డింగ్ విన్యాసంతో ఆకట్టుకున్నాడు. అతని సూపర్ క్యాచ్‌కు బిత్తరపోయిన ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్(9) నిరాశగా పెవిలియన్ చేరాడు. సంజూ స్టన్నింగ్‌ క్యాచ్‌లో మైదానంలో ఆటగాళ్లతో పాటు కామెంటేటర్స్ అవాక్కయ్యారు. వాటే క్యాచ్ అంటూ కొనియాడాడరు.

ఢిల్లీ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ తొలి బంతిని జయదేవ్ ఉనాద్కత్ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా.. శిఖర్ ధావన్ స్కూప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి ఫస్ట్ స్లిప్ దిశగా దూసుకెళ్లగా.. కీపర్ సంజూ శాంసన్ స్పైడర్ మ్యాన్‌లా గాల్లో తేలుతు బంతిని అందుకున్నాడు. ప్రస్తుతం ఈ స్టన్నింగ్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. శాంసన్ వికెట్ కీపింగ్ స్కిల్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పక్షివా? సూపర్ మ్యాన్‌వా? అంటూ కామెంట్ చేస్తున్నారు.

IPL 2021: Watch how Sanju samson takes brilliant catch to dismiss Dhawan

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్‌కు దిగింది. అయితే ఆ జట్టుకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. చాలా రోజుల తర్వాత పవర్ ప్లేలో బంతిని అందుకున్న రాజస్థాన్ పేసర్ జయదేవ్ ఉనాద్కత్.. స్టన్నింగ్ డెలివరీతో పృథ్వీ షా(2)ను పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే తన మరుసటి ఓవర్‌లో శాంసన్ స్టన్నింగ్ క్యాచ్‌తో శిఖర్ ధావన్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అజింక్యా రహానే(8)ను రిటర్న్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చి ఢిల్లీకి కోలుకోలేని దెబ్బ తీశాడు. దాంతో పవర్ ప్లే ముగిసే సరికి 3 వికెట్లకు ఢిల్లీ 36 రన్స్ చేసింది.

ఆ తర్వాత మార్కస్ స్టోయినిస్(0) ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఔట్ చేయడంతో ఢిల్లీ 37 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన లలిత్ యాదవ్‌తో పంత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. రాహుల్ తెవాటియా వేసిన 11వ ఓవర్‌లో నాలుగు బౌండరీలు బాది 20 రన్స్ పిండుకున్నాడు. దాంతో 11 ఓవర్లలో ఢిల్లీ 77/4 స్కోర్ చేసింది.

English summary
Be it with the toss, the bat, or the gloves, newly-appointed Rajasthan Royals captain Sanju Samson has not put a foot wrong in this IPL. During Rajasthan Royals’ second match of the tournament, Samson came up with the goods in Wankhede on Thursday as he took a stunning one-handed catch to send the ever-so-dangerous Shikhar Dhawan back in the hut. Samson had to dive full-stretch in the air to hold on to the ball. Dhawan looked to use the pace of Jaydev Unadkat and play a scoop over the keeper.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X