ఐపీఎల్‌లో ఛీర్ లీడర్స్ రీఎంట్రీ: ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్
అహ్మదాబాద్: ఎప్పుడెప్పుడా అంటూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది క్రికెట్ ప్రేమికులు ఎదురు చూసిన ఇండియన్ ప్రీిమియర్ లీగ్ 2023 సీజన్ 16వ ఎడిషన్ గ్రాండ్ గా ఆరంభమైంది. అహ్మదాబాద్ మొతెరాలోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్- గుజరాత్ టైటన్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ కు దిగింది చెన్నై సూపర్ కింగ్స్. ఆరంభంలో తడబడినా భారీ స్కోర్ దిశగా సాగుతోందా జట్టు.
మూడో ఓవర్ లోనే వికెట్ ను కోల్పోయింది చెన్నై సూపర్ కింగ్స్. మహ్మద్ షమీ వేసిన ఓవర్ అది. ఆ ఓవర్ రెండో బంతికి సీఎస్‌కే ఓపెనర్ డెవాన్ కాన్వే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. షమీ సంధించిన ఫుల్ లెంగ్త్ బంతిని డ్రైవ్ చేయబోయి టైమింగ్ మిస్ అయ్యాడు కాన్వే. ఆ బంతి కాస్తా వికెట్లను గిరాటేసింది. ఇది- మహ్మద్ షమీ ఖాతాలో వందో ఐపీఎల్ వికెట్. డెవాన్ కాన్వే స్థానంలో బ్యాటింగ్ కు దిగిన మొయిన్ అలీ భారీ షాట్లు ఆడినప్పటికీ.. ఎక్కువ సేపు క్రీజ్ లో నిల్చోలేకపోయాడు.

రషీద్ ఖాన్ బౌలింగ్ లో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఉన్నంత సేపూ దూకుడుగా ఆడాడు అలీ. 17 బంతుల్లో 23 పరుగులు చేశాడు. ఇందులో ఒక సిక్సర్, నాలుగు ఫోర్లు ఉన్నాయి. మరో ఎండ్ లో రుతురాజ్ గైక్వాడ్ తన ట్రేడ్ మార్క్ షాట్లతో చెలరేగాడు. 18 బంతుల్లో 37 పరుగులు బాదాడు. ఇందులో మూడు సిక్సర్లు, మూడు ఫోర్లు ఉన్నాయి. 205 స్ట్రైక్ రేట్ తో గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపిస్తోన్నాడు. అతనికి తోడుగా బెన్ స్టోక్స్ క్రీజ్ లో ఉన్నాడు.
కాగా- ఈ ఐపీఎల్ 2023 సీజన్ తో ఛీర్ లీడర్స్ రీఎంట్రీ ఇచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితుల వల్ల 2020 సీజన్ నుంచీ వారు చేసే సందడిని మిస్ అయ్యారు ప్రేక్షకులు. 2020, 2021, 2022 సీజన్ లల్లో ఛీర్ లీడర్స్ కనిపించలేదు. అప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. దీనితో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్.. మళ్లీ ఛీర్ లీడర్స్ ను పిలిపించింది. బ్యాట్ నుంచి బులెట్ వేగంతో వెలువడే బంతి బౌండరీ దాటినా, ఫెన్సింగ్ మీదుగా గాల్లోకి లేచినా.. వికెట్ కూలినా.. ఛీర్ లీడర్స్ చేసే సందడి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంటుంది. ఇప్పుడు మళ్లీ వారి గ్లామర్ ఈ ఐపీఎల్ సీజన్ కు అదనపు హంగులను తెచ్చిపెట్టింది.












Click it and Unblock the Notifications