IPL 2023:టాస్ తర్వాతే అన్నీ.. ఐపీఎల్‌లో కొత్త రూల్స్ వచ్చేశాయ్..!
ఐపీఎల్‌లో ఈ సారి పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. టాస్ వేశాక తుది జట్టును ప్రకటించే కొత్త నిబంధన తీసుకొచ్చారు.
ముంబై: మార్చి 31వ తేదీన దేశంలో మరో క్రీడా సంరంభంకు తెరలేవనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. ఈసారి ఐపీఎల్‌లో పలు మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. కొన్ని కొత్త నిబంధనలు కూడా తీసుకువస్తున్నారు. సాధారణంగా ఇరు జట్ల కెప్టెన్లు టాస్‌కు ముందే తమ జట్టుకు సంబంధించిన ప్లేయింగ్ ఎలెవెన్ జాబితాను అందజేస్తారు. అయితే ఈ సారి మాత్రం ఇందుకు భిన్నంగా ఒక్కో జట్టుకు సంబంధించి రెండు ప్లేయింగ్ ఎలెవెన్ జాబితాలతో వస్తారు. టాస్ వేశాక తమకు ఏ జాబితా అయితే అనుకూలంగా ఉంటుందో ఆ జాబితాలోని ప్లేయర్స్ ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఉంటారు. అంటే టాస్ వేశాకా బ్యాటింగ్ లేదా బౌలింగ్ ఎంచుకున్న తర్వాతే జాబితాను అందజేస్తారు.
ప్రస్తుతం టాస్ కోసం ఫీల్డ్ మీదకు వచ్చిన సమయంలో ఇద్దరు కెప్టెన్లు తమ ప్లేయర్ల జాబితాను ఒకరికొకరు అందజేసుకుంటారు. అయితే ఇప్పుడు టాస్ వేశాకే టీమ్ జాబితాను ప్రత్యర్థి కెప్టెన్‌కు అందజేస్తారు.అంతేకాదు ఇలా చేయడం వల్ల అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ప్రభావితం చేయగల ప్లేయర్‌ను చేరుస్తారు.ఈ ప్రయోగం సౌతాఫ్రికా20 లీగ్‌లో అమలు చేయగా అది సక్సెస్ అయ్యింది. దీంతో ఇదే పద్ధతిని ఐపీఎల్‌లో కూడా అనుసరించాలని ఫ్రాంఛైజీలు భావించారు.

జట్టును ప్రకటించడానికి ముందుగా ఆయా జట్లు 13 మంది ప్లేయర్లతో కూడిన జాబితాను సిద్ధం చేస్తుంది.ఇలా చేయడం వల్ల టాస్ పై ఉన్న ప్రభావం తగ్గించి అప్పటి పరిస్థితులకు అనుకూలంగా ఉన్న ప్లేయర్లను చేర్చడం ద్వారా మ్యాచ్ మరింత రంజుగా ఉంటుందని సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ అభిప్రాయపడ్డారు.ఇక భారత్‌లో చీకటి పడేకొద్దీ గ్రౌండ్ పై మంచు లేదా తేమ వచ్చి చేరుతుంది. దీంతో సెకండ్ ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసే జట్టుపై తేమ ప్రభావం బాగా చూపుతుంది.

ఇదిలా ఉంటే ఈ సారి ఐపీఎల్‌లో మరిన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. వికెట్ కీపర్ ఉన్న స్థానంలో ఉండకుండా అటూ ఇటూ కదులుతూ కనిపిస్తే ఆ బాల్ డెడ్‌బాల్‌గా ప్రకటించడమే కాకుండా ఐదు పెనాల్టీ రన్స్ ఇవ్వడం జరుగుతుంది.ప్లేయర్ కూడా నిబంధనలకు విరుద్ధంగా అటూ ఇటూ కదులుతూ ఉంటే కూడా పై విధంగానే జరిమానా ఉంటుంది.













Click it and Unblock the Notifications