King Fisher Beer: ఆ బీరు కోసం ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన యువకుడు..!

కింగ్ ఫిషర్ బీరు కావాలని ఓ యువకుడు ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు.

ఎవరైనా కలెక్టర్ వద్దకు ఎందుకు వెళ్తారు.. ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించాలని వెళ్తారు. కానీ ఓ యువకుడు తాగడానికి నీళ్లు లేవని కాకుండా.. తాగడానికి కింగ్ ఫిషర్ బీరు అమ్మడం లేదని ఏకంగా ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. ఇది ఎక్కడో కాదు.. మన జగిత్యాలలో. బీరం రాజేష్ అనే యువకుడు జగిత్యాలలో చల్లని బీర్లను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

తమకు కింగ్ ఫిషర్ బీరు అందుబాటులోకి తేవాలని అదనపు కలెక్టర్ లతకు వినతి పత్రాన్ని ఇచ్చాడు. జిల్లాలో కల్తీ మద్యం అమ్ముతున్నారని దీంతో యూరిక్ యాసిడ్ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వినతి పత్రంలో తెలిపాడు. జిల్లాలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఉన్నాయని, అందులో ఒక్కో బీర్ కు రూ. 200 నుంచి 300 వరకు వసూలు చేస్తున్నారని పేర్కొన్నాడు.

A young man complained on the radio that he wanted Kingfisher beer

యువకుడి ఫిర్యాదుపై స్థానికంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు కల్తీ మద్యంతో ఆరోగ్యం చెడిపోతుందని చెప్పగా.. మరి కొందరు తాగడం ఎందుకు, బాధపడడం ఎందుకని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+