Crime: పెళ్లైనా వదలలేదు.. చివరికి ప్రాణాలు కోల్పోయాడు..
ఓ యువకుడు ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలిసింది. దీంతో యువతి తల్లిండ్రులు ఆమెకు వేరే సంబంధం చూశారు. పెళ్లి కూడా చేశారు. పెళ్లి అయిందా కాదా అని ఆ యువకుడు ఆమెను వదిలి పెట్టలేదు. ఆమెకు కూడా అతడిని వదిలేందుకు సిద్ధంగా లేదు. ఇంకెముంది.. ఆ మహిళ పెళ్లైనా ప్రియుడితో ఫోన్ లో మాట్లాడుతుంది. అప్పుడప్పుడు కలుస్తోంది. దీనిపై అమ్మాయి తల్లిదండ్రులు అతడిని హెచ్చరించారు. అయినా అతడు తీరు మార్చుకోలేదు. చివరికి ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. బీర్ పూర్ కు చెందిన జువ్వికింది వంశీ స్థానికంగా ఓ డ్రైవింగ్ స్కూల్ లో పని చేస్తున్నాడు. తల్లి కూలీ పనులు చేసుకుంటూ ఉంటుంది. తండ్రి ఉపాధి నిమిత్తం దుబాయి వెళ్లాడు. వంశీకి బీర్ పూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన అమ్మాయితి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. కొద్ది కాలం తర్వాత ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు.

ఓ పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేశారు. వివాహం తర్వాత కూడా వంశీ అమ్మాయితో టచ్ లో ఉన్నాడు. వారు తరుచూ ఫోన్ లో మాట్లాడుకునే వారు. ఈ విషయమై భర్త.. అత్తింటివారిని నిలదీశాడు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు వంశీని హెచ్చరించారు. పద్ధతి మార్చుకోవాలని కోరారు. అయినా వంశీ మారలేదు. యువతితో ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు. ఆదివారం వంశీ కొల్వాయి నుంచి తుంగూర్ కు బైక్ వెళ్తుండగా.. ఇద్దరు వ్యక్తులు అతన్ని ఆపారు.
మరుణాయుధాలతో వంశీపై దాడి చేశారు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. వంశీ మరణ వార్త తెలుసుకున్న తల్లి, బంధువులు, గ్రామస్థులు భారీగా ఘటనస్థలికి చేరుకున్నారు. నిందితులను తమకు అప్పగించాలని ఆందోళనకు దిగారు. డీఎస్పీ ప్రకాశ్, సీఐ,ఎస్సై అక్కడి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అమ్మాయి తండ్రి రమేష్, అన్న విష్ణు తన కొడుకు హత్య చేశారని వంశీ తల్లి భాగ్య ఆరోపించారు.












Click it and Unblock the Notifications