గురుకుల పాఠశాలకు సర్పంచ్ సాయం: కూతురికి 9.8 గ్రేడ్
జగిత్యాల: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గురుకుల పాఠశాలలకు పెద్ద పీట వేసింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకుల సెక్రటరీగా ఉన్నప్పుడు ఎలాంటి సమస్య లేదు. ఆ తర్వాత పట్టించుకునే వారే లేరు. మెట్‌పల్లి గురుకుల పాఠశాలలో మంచినీటి సమస్య ఉంది. పై అధికారులకు చెప్పినప్పటికీ ఫలితం లేదు. దీంతో వేములకుర్తి సర్పంచ్ నవ్య శ్రీ సత్యం ముందుకొచ్చారు. తన సొంత డబ్బులతో పాడయిన మోటార్ బాగు చేయించారు. ఇందుకోసం రూ.లక్ష వరకు ఖర్చయ్యింది.
పిల్లల సమస్య ఉండొద్దనే మోటార్ బాగు చేయించానని సర్పంచ్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఆ పాఠశాలలో తన కూతురు చదువుకుందని.. 9.8 గ్రేడ్ సాధించిందని తెలిపారు. అలాంటి స్కూల్‌లో సమస్య తెలిసి స్పందించానని వివరించారు. కార్యక్రమంలో కొండ్రికర్ల ఉప సర్పంచ్ రాజేశ్వర్, పేరంట్స్ కమిటీ సభ్యులు రాజేందర్, నారాయణ, శంకర్, ప్రశాంత్, మనోజ్ తదతరులు పాల్గొన్నారు.

నిజానికి తెలంగాణ ఏర్పడిన తర్వాతే గురుకుల పాఠశాల రూపు రేఖలు మారాయి. విద్యార్థులకు సన్నం బియ్యంతో భోజనం పెట్టడం, స్టైపండ్ పెంచడం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్రటరీగా ఉన్నప్పుడు గురుకులాల్లో ఏ సమస్య లేదు. పదవీ నుంచి ఆయన వైదొలిగిన తర్వాత సమస్యల నిలయాలుగా మారాయి. చాలా మంది గురుకుల పాఠశాల నుంచి వెళ్లిపోయిన ఘటనలు చుశాం. వాటికి పూర్వ వైభవం తీసుకురావాలి. స్థానికంగా ఉండే నేతలు ఇలా సాయం చేయడంతో ఆ సమస్యలు తీరుతున్నాయి.

ప్రభుత్వం కూడా క్షేత్రస్థాయిలో ఇష్యూను సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే నేటి బాలలే రేపటి పౌరులు.. భారత జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించేవారికి మెరుగైన విద్య, వసతి, సౌకర్యాలు అందకుండా పోతాయి. మళ్లీ ఉమ్మడి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. కొందరు నేతలు ముందుకొచ్చి సమస్య పరిష్కారం చేయడంతో పిల్లలు చక్కగా చదువుకునే పరిస్థితి.. లేదంటే సమస్యల నిలయంలో వారి చదువు కొనసాగే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఏం ప్రయోజనం లేకుండా ఉంటుంది.












Click it and Unblock the Notifications