Boy Kidnap: జనగామ జిల్లాలో కిడ్నాప్ కలకలం.. ఇంకా లభించని బాలుడి ఆచూకీ..
జనగామ జిల్లాలో కిడ్నాప్ కలకలం రేగింది. కొడకండ్లలో ఆదివారం నాలుగేళ్ల బాలుడు సాబీర్ అదృశ్యం స్థానికంగా సంచలనం సృష్టించింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తాజీపూర్ గ్రామానికి చెందిన 8 కుటుంబాల వివిధ గ్రామాల్లో తిరుగుతూ సంచార జీవనం చేస్తుంటారు.
వారు నెల రోజుల క్రితం కొడకండ్లకు వచ్చి ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద గుడిసెలు వేసుకున్నారు. కొందరు కట్టెకోత మిల్లులో పని చేస్తుండగా మరికొందరు గుడారాల వద్ద అల్యూమినియం వస్తువులు తయారు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు బాలుడి తండ్రి జమాల్ సూర్యాపేట జిల్లా తిర్మలగిరిలోని కట్టెకోత మిల్లులో పని చేసేందుకు ద్విచక్రవాహనంపై వెళ్లాడు.

ఆ సమయంలో సాబీర్ గుడారం బయట ఇతర పిల్లలతో ఆడుకుంటున్నాడు. ఉన్నట్టుండి సాబీర్ కనిపించకుండా పోయాడు. వెంటనే స్పందించిన తల్లి తన భర్త జమీల్ కు ఫోటే చేసింది. జమీల్ హుటాహుటిన అక్కడికి చేరుకుని కొడుకు కోసం వెతికారు. ఎంత వెతికినా సాబీర్ ఆచూకీ లభించలేదు. దీంతో జమీల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న ఎస్సై కొంరెల్లి, పాలకుర్తి సీఐ చేరాలు సిబ్బందితో పాటు గాలింపు చేశారు. పరిసరాల్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై బాలుడిని కొట్టుకుంటూ తీసుకెళ్లినట్లు పుకార్లు రావడంతో పోలీసులు సూర్యాపేట జిల్లా వెలిచాల, తిర్మలగిరి రహదారిలో గాలింపు చేపట్టారు. సాయంత్రం ఐదు గంటల వరకు ఆచూకీ తెలియకపోవడంతో బాలుడి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications