Janagama: తల్లిని గొడ్డలితో నరికిన కొడుకు.. తల చేతిలో పట్టుకుని పోలీస్ స్టేషన్‍లో లొంగుబాటు..
జనగామ జిల్లా ఓ కొడుకు తల్లిని గొడ్డలితో నరికి తలను చేతిలో పట్టుకుని పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు
ఓ కొడుకు తల్లిని గొడ్డలితో నరికి తలకాయను పట్టుకుని పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన దారుణ ఘటన జనగామ జిల్లాలో జరిగింది. మరిగడిలో గురువారం తనకు భూమి ఇవ్వలేదని ఆగ్రహంతో కొడుకు తల్లిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. గ్రామానికి చెందిన కూరాకుల రమణమ్మ, రాజయ్య దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు ఉంది. రాజయ్య పదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అనంతరం రాజయ్య పేరుపై ఉన్న పదెకరాల భూమి రమణమ్మ పేరుపైకి వచ్చింది.

భూ పంపకాలు
అయితే కూతురుకు కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి చేయగా.. భర్తతో విబేదాలు తలెత్తి తల్లి రమణమ్మ వద్దే ఉంటుంది. కొడుకు కన్నప్పకు కూడా కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లియింది. అతనికి అతనికి ఒక కుమార్తె ఉంది. ఈ క్రమంలో భూమిన ఇవ్వాలని రమణమ్మపై కన్నప్ప ఒత్తిడి చేశాడు.
దీంతో రమణమ్మ భూ పంపకాలు చేసింది. పది ఎకరాల్లో కొడుకు 2 ఎకరాలు, కూతురికి 4 ఎకరాలు, తన వద్ద 4 ఎకరాలు ఉంచుంకుంది.

మరో 2 ఎకరాలు
అయితే కుమార్తె 4 ఎకరాలు రాసిచ్చి.. తనకు 2 ఎకరాలే ఇవ్వడం పట్ల కన్నప్ప అసహనం వ్యక్తం చేశాడు. తన పేరున మరో 2 ఎకరాలు రాయాలని తల్లిపై ఒత్తిడి తెచ్చాడు. ఈ విషయమై పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. అయినా తల్లి భూమి ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో కన్నప్ప తల్లిని కొట్టాడు. దీంతో రమణమ్మ కన్నప్పపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ విషయమై కన్నప్పపై గ్రామ పెద్దలు, పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ఆత్మహత్యాయత్నం
దీంతో కన్నప్ప రెండు రోజుల కిందట ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అతను ఉరివేసుకునే ప్రయత్నం చేయగా కుటుంబ సభ్యులు చూసి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన కన్నప్ప రాగానే తల్లి వద్దకు వెళ్లి గొడవకు దిగాడు. వెంట తెచ్చుకున్న గొడ్డలితో నరికాడు. తల, మొండం వేరు చేశాడు. తల్లి తలకాయ పట్టుకుని జనగామ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో గ్రామస్థులు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు.

తలకాయతో
కన్నప్ప తలకాయతో వెళ్తున్న దృశ్యాలు చూసిన వారు ఆందోళన చెందారు. కాగా ఈ కేసులో నిందితుడు లొంగిపోయాడని జనగామ సీఐ ఎల్లబోయిన శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రమణమ్మ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరో ఘటనలో నలుగురు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధి తుమ్మనూరు గేట్ సమీపంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదంలో నలుగురు దర్మరణం చెందారు. మృతులు నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి గ్రామానికి చెందిన కేశవులు(35), యాదయ్య(34), శ్రీను(30), లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామస్వామి(32)గా పోలీసులు గుర్తించారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications