అనూహ్యంగా కడపలో ప్రత్యక్షమైన రజినీకాంత్ - ఏఆర్ రెహ్మాన్‌తో కలిసి..!!
కడప: సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్.. ఇవ్వాళ రాయలసీమ జిల్లాల్లో పర్యటించారు. తన కుమార్తె, దర్శకురాలు సౌందర్యతో కలిసి తిరుపతి, కడప జిల్లాలను సందర్శించారు. అదే సమయంలో ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ కూడా కడపకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అనూహ్యంగా కడపలో ప్రత్యక్షమైన రజినీకాంత్‌ను చూడటానికి అభిమానులు ఎగబడ్డారు. ఆయనతో సెల్ఫీ దిగడానికి పోటీ పడ్డారు.

కుమార్తెతో కలిసి..
రజినీకాంత్ మూడు రోజుల కిందటే 72వ పుట్టినరోజును జరుపుకొన్న విషయం తెలిసిందే. డిసెంబర్ 12వ తేదీ ఆయన జన్మదినం. 72వ సంవత్సరంలోకి ఆయన ప్రవేశించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారాయన. ఈ తెల్లవారు జామున కుమార్తెతో కలిసి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన సమయంలో రజినీకాంత్ వెంట తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి ధర్మారెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.

సుప్రభాత సేవలో..
తిరుమలకు చేరుకున్న రజినీకాంత్, సౌందర్యను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. నేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని రంగనాయకుల మండపం వద్ద టీటీడీ అర్చుకులు ఆయనకు ఆశీర్వచనాలు పలికారు. స్వామివారి శేషవస్త్రాన్ని బహూకరించారు. శ్రీవారి చిత్రపటాన్ని, లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.

కడప దర్గాలో..
అక్కడి నుంచి నేరుగా కడపకు చేరుకున్నారు రజినీకాంత్. ప్రఖ్యాత అమీన్ పీర్ దర్గాను సందర్శించారు. ఏఆర్ రెహ్మాన్ కూడా రజినీకాంత్‌ను కలిశారు. వారిద్దరూ కలిసి కడప దర్గాకు వెళ్లారు. దర్గా ప్రతినిధులు వారికి పూల మాల వేసి ఘనంగా స్వాగతం పలికారు. సంప్రదాయబద్ధమైన కాషాయ తలపాగాను ధరింపజేశారు. కండువాను మెడలో వేసుకున్నారు. అరగంట పాటు దర్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఎగబడ్డ ఫ్యాన్స్..
అనూహ్యంగా రజినీకాంత్, ఏఆర్ రెహ్మాన్ కడపలో ప్రత్యక్షం కావడం పట్ల అభిమానుల ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా చేసింది. రజినీకాంత్ వచ్చారనే సమాచారం తెలుసుకున్న వెంటనే పెద్ద ఎత్తున స్థానికులు అమీన్ పీర్ దర్గాకు చేరుకున్నారు. ఆయనను చూడటానికి ఎగబడ్డారు. సెల్ఫీల కోసం పోటీ పడ్డారు. అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో తొక్కిసలాట చోటు చేసుకోకుండా కడప పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

సెట్స్‌పై జైలర్..
రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమాలో నటిస్తోన్నారు. ఇది ఆయన నటిస్తోన్న 169వ సినిమా. ఈ మూవీ చిత్రీకరణ జరుపుకొంటోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. రజినీకాంత్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ మూవీ ట్రైలర్‌ను చిత్రం యూనిట్ విడుదల చేసింది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిథి మారన్ ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. నెల్సన్ దిలీప్ కుమార్.. దర్శకుడు. అనిరుద్ధ్ రవిచంద్రన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications