పులివెందులలో తుపాకీ మోత: ఇద్దరి మృతి: వైసీపీ సానుభూతిపరులుగా
కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం.. పులివెందులలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. ఆస్తి తగాదా వల్లే ఈ ఉదంతం చోటు చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఆస్తి తగాదా, పాత కక్షల నేపథ్యంలో తన సమీప బంధువును తుపాకీతో కాల్చి చంపిన ఓ వ్యక్తి.. అనంతరం అదే తుపాకీతో తనను తాను కాల్చుకున్నాడు. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.
మృతులను పార్థసారథి రెడ్డి, ప్రసాద రెడ్డిగా గుర్తించారు. పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లిలో వారు నివసిస్తోన్నారు. వారిద్దరి కుటుంబాల మధ్య బంధుత్వం కూడా ఉంది. కొంతకాలంగా వారిద్దరి కుటుంబాల మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఆ తగాదాలు మరింత ముదిరాయి. పరస్పరం దాడులు చేసుకోవడానికి దారి తీసింది. ఈ క్రమంలో ఈ ఉదయం పార్థసారథి రెడ్డి నల్లపురెడ్డి పల్లిలోని తన ఇంట్లో నుంచి బైక్‌పై బయటికి బయలుదేరి వెళ్తోన్న సమయంలో ప్రసాదరెడ్డిపై కత్తితో దాడి చేసినట్లు అనుమానిస్తోన్నారు.

దీన్ని అడ్డుకోవడానికి ప్రసాద రెడ్డి.. తుపాకీతో పార్థసారథి రెడ్డిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మరణించాడు. ఆ కొద్దిసేపటికే ప్రసాద రెడ్డి కూడా తనను తాను తుపాకీతో కాల్చుకున్నట్లు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టమ్ కోసం పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రసాద రెడ్డి వద్ద లైసెన్స్డ్ తుపాకీ ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. దానితోనే కాల్పులు జరిపారని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ రెండు కుటుంబాలు కూడా వైసీపీలో ఉన్నట్లు స్థానికులు పేర్కొన్నారు.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత












Click it and Unblock the Notifications