కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెడీ టు వర్క్‌: జగన్ సొంత జిల్లాలో ఈఎంసీ: ప్రారంభానికి ముహూర్తం ఖరారు?: 30 వేల జాబ్స్

|
Google Oneindia TeluguNews

కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోని కొప్పర్తిలో నిర్మిస్తోన్న వైఎస్సార్‌ ఎల్రక్టానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ (వైఎస్ఆర్ ఈఎంసీ) తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఈ క్లస్టర్ నిర్మాణానికి అవసరమైన తుది అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులను జారీచేసి నేపథ్యంలో పనులు వేగం పుంజుకున్నాయి. తెలుగు సంవత్సరాది ఉగాది నాటికి దీన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చేలా ఏపీఐఐసీ చర్యలు తీసుకుంటోంది. ఈ క్లస్టర్‌లో పరిశ్రమలను నెలకొల్పే పారిశ్రామికవేత్తలకు రెడీ టు వర్క్‌కు అవసరమైన సౌకర్యాలను సమకూర్చుతోంది.

కరోనా కమ్ముకుంటోన్న వేళ..తెలంగాణలో లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన: నిండు సభలోకరోనా కమ్ముకుంటోన్న వేళ..తెలంగాణలో లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన: నిండు సభలో

కడప సమీపంలోని కొప్పర్తిలో 540 ఎకరాల్లో 748.76 కోట్ రూపాయల వ్యయంతో ఈ క్లస్టర్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే గ్రాంట్‌ రూపంలో 350 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. పరిశ్రమలు, పెట్టుబడులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఎస్‌టీపీఐ లేఖ రాసింది. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎస్క్రో అకౌంట్‌‌లో తన వాటాను జమ చేయాల్సి ఉంటుందని, కేంద్రం మంజూరు చేసిన వాటా మూడు విడతల్లో నేరుగా ఎస్క్రో అకౌంట్‌కు జమ చేస్తామని తెలిపిింది.

AP CM YS Jagan likely to inagurates EMC at Kopparthi in Kadapa on Ugadi festival

ఈఎంసీని అందుబాటులోకి తీసుకొచ్చిన తరువాత ఎల్రక్టానిక్స్‌ తయారీ రంగానికి చెందిన కంపెనీలు తమ యూనిట్లను ఏర్పాటు చేసుకుంటాయి. దీనికి అవసరమైన భూమిని ప్రభుత్వం సమకూర్చుతుంది. 350 ఎకరాలను ఆయా కంపెనీలకు విక్రయానికి లేదా లీజుకు అందుబాటులో తీసుకని వస్తుంది ప్రభుత్వం. 92 ఎకరాల్లో రెడీ టు బిల్ట్‌ ఫ్యాక్టరీ షెడ్స్‌ నిర్మిస్తారని కేంద్రం ఆ ఉత్తర్వుల్లో వివరించింది. ఆ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్‌కు డిక్సన్‌ టెక్నాలజీస్‌ ఇండియా లిమిటెడ్‌ యాంకర్‌ కంపెనీగా వ్యవహరిస్తుంది.

ఆ సంస్థ ఇప్పటికే 300 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టనుంది. ఆ సంస్థ కోసం 70 ఎకరాలను ప్రభుత్వం కేటాయిస్తుంది. ఉగాది నాటికి ఈ ఈఎంసీని ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ పనులను ఏపీఐఐసీ పర్యవేక్షిస్తోంది. ఇప్పటికే 50 కోట్ల రూపాయలతో నాలుగు రెడీ టు వర్క్‌ షెడ్ల నిర్మాణం, అంతర్గత రోడ్లు వంటి పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఇక్కడ పెట్టుబడులు పెట్టే కంపెనీలు నేరుగా వచ్చిన రోజు నుంచే ఉత్పత్తి ప్రారంభించే విధంగా రెడీ టు వర్క్‌ విధానంలో అన్ని వసతులతో ఈఎంసీని అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్లస్టర్ వద్ద 30 వేల ఉద్యోగాలు కల్పించాలనేది జగన్ సర్కార్ ప్రణాళిక.

English summary
Andhra Pradesh government headed by Chief Minister YS Jagan Mohan Reddy, likely to inagurates YSR Electronic Manufacturing Cluster (YSR EMC) at Kopparthi of Kadapa District on Ugadi festival.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X