సీయం విచారణను ప్రభావితం చేస్తున్నారు: సీఈఓకు వివేకా కుమార్తె ఫిర్యాదు..
తన తండ్రి హత్య కేసు ను పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని వివేకా కుమార్తె సునీత రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసారు. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు విచారణాధికారులను ప్రభావితం చేసేలా ఉన్నాయని ఆమె ఫిర్యాదు చేశారు. సిట్ విచారణ పారదర్శకంగా జరిగేలా చూడాలని ఆమె ద్వివేదిని కోరారు. త్వరలో కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఈ విషయంపై ఫిర్యాదు చేస్తామన్నారు సునీత.

సీఈవోకు ఫిర్యాదు
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేదిని దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డా. సునీతారెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి కలిశారు. వివేకా హత్య కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆమె ద్వివేదికి ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు విచారణాధికారులను ప్రభావితం చేసేలా ఉన్నాయన్నారు. సిట్ విచారణ పారదర్శకంగా జరిగేలా చూడాలని ఆమె ద్వివేదిని కోరారు. త్వరలో కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఈ విషయంపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు . సిట్ పై ప్రభావం చూపేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఉన్నాయి. దర్యాప్తు సంస్థపై సీఎం ఒత్తిడి ఉంటే కేసు తప్పుదారి పట్టే అవకాశం ఉంది. దర్యాప్తు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఎన్నికల ప్రధాన అధికారి దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిక ఇస్తామని సీఈవో హామీ ఇచ్చారు.

కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి..













Click it and Unblock the Notifications