సీఎంను కలిసిన విజయసాయిరెడ్డి బావమరిది : పార్టీలో చేరండి..టిక్కెట్ తరువాత..!
కొద్ది రోజుల క్రితం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి బావమరిది వైసిపి లో చేరారు. ఇప్పుడు వైసిపి నేత విజయ సాయి రెడ్డి బావ మరిది టిడిపిలో చేరుతున్నారు. ఏపి లో జరుగుతున్న పోటా పోటీ రాజకీయాల్లో రెండు పార్టీలోని కీలక నేతలను నైతికంగా దెబ్బ తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా వైసిపి లో కీలకంగా వ్యవహరిస్తున్న ఎం పి విజయ సాయిరెడ్డి బావ మరిది..మాజీ ఎమ్మెల్యే ద్వారకానాధ రెడ్డి టిడిపిలో చేరటానికి రంగం సిద్దమైంది.
సీయంతో బేటీ..టిక్కెట్ కు వినతి..
వైసిపి ప్రధాన కార్యదర్శి..జగన్ కు కుడిభుజం గా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డి బావ మరిది ముఖ్యమంత్రి చంద్ర బాబును కలిసారు. రాయచోటి మాజీ ఎమ్మెల్యేగా వ్యవహరించిన గడికోట ద్వారకానాధరెడ్డి ముఖ్యమంత్రిని కలిసి టిడి పిలోకి వస్తానని తనకు సీటు కేటాయించాలని కోరారు. అర్దరాత్రి జరిగిన ఈ సమావేశంలో తాను పార్టీ మారేందుకు సిద్దం గా ఉన్నానని చెప్పుకొచ్చారు. రాయచోటి నుండి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. జగన్ పార్టీ ఏర్పాటు నుండి ఆయనతోనే ఉన్న ద్వారకానాద్ రెడ్డి రాయచోటి అసెంబ్లీ సీటును ఆశించారు. రెండు సార్లు ప్రయత్నించినా సీటు దక్కలేదు. దీంతో..ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. విజయ సాయిరెడ్డి బుజ్జగింపులతో ఆగిన ద్వారకా నాద్ రెడ్డి ఈ సారైనా సీటు ఇవ్వాలని అభ్యర్ధించారు. అయితే, సిట్టింగ్ ఎమ్మెల్యే సీటు ఇస్తామని పార్టీ అధినేత జగన్ తేల్చి చెప్పారు. దీంతో..ద్వారకా నాద్ రెడ్డి పార్టీ మారాలని డిసైడ్ అయ్యారు.

టిడిపి నుండి మాజీ ఎమ్మెల్యేగా..
గడికోట ద్వారకానాధ్ రెడ్డి 1994 లో లక్కిరెడ్డిపల్లె నుండి టిడిపి అభ్యర్దిగా గెలుపొందారు. 224 లో కాంగ్రెస్ లో చేరారు. ఆ తరువాత పరిణామాల్లో జగన్ వెంట ఉన్నారు. తనకు రాయచోటి టిక్కెట్ ఈ సారి ఎన్నికల్లో ఇవ్వరని తేలి పోవటం తో అక్కడ వైసిపి అభ్యర్ది ఎలా గెలుస్తారో చూస్తానని బహిరంగంగానే వ్యాఖ్యలు చేసారు. దీంతో..జిల్లా రాజకీయాల్లో కీలకం గా వ్యవహరిస్తున్న ఓ మంత్రి సహకారంతో ముఖ్యమంత్రిని కలిసారు. తనకు రాయచోటి సీటు ఇవ్వాలని అభ్యర్దించా రు. అయితే, ముందు పార్టీలో చేరాలని..నియోజకవర్గ నేతలతో మాట్లాడిన తరువాత టిక్కెట్ సంగతి చూద్దామంటూ ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, స్థానిక టిడిపి నేతలు మాత్రం ద్వారకానాధ రెడ్డి రాకను వ్యతిరేకిస్తున్నారు, ఆయనకు సీటు ఇవ్వద్దని డిమాండ్ చేస్తున్నారు. తమ నియోజకవర్గంలో టిడిపి నుండి పోటీ చేసే వారు ఉన్నారని..కొత్త వారి అవసరం లేదని తేల్చి చెబుతున్నారు. వైసిపి లో సీటు దొరక్క..టిడిపి వైపు చూస్తున్న ద్వారకానాద్ రెడ్డి ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.