రాజారెడ్డి ఘాట్ లో వివేకానంద రెడ్డి అంత్యక్రియలు ... కన్నీటి వీడ్కోలు పలికిన అభిమానులు

ఏపీ రాజకీయాల్లో సంచలనం గా మారిన , దారుణ హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి అంతిమ యాత్ర శనివారం ఉదయం జరిగింది . తమ ప్రియతమ నేతలకు కడపటి వీడ్కోలు పలికేందుకు పెద్ద యెత్తున అభిమానులు పులివెందులకు తరలి వచ్చారు. తమ నేతకు కడసారి వీడ్కోలు పలికారు. కన్నీటి పర్యతం అయ్యారు.

వైఎస్ వివేకా అంతిమ యాత్రలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, అవినాష్ రెడ్డి సహా పలువురు వైసిపి నాయకులు, బంధువులు పాల్గొన్నారు.అశేష జనవాహిని మధ్య వివేకానంద రెడ్డి అంతిమ యాత్ర సాగింది.

Vivekananda Reddys funeral in Rajareddi Ghat ... tear-farewell of fans

వైఎస్ వివేకానంద రెడ్డి అంత్యక్రియలు రాజారెడ్డి ఘాట్ లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు కుటుంబ సభ్యులు . పులింవెందుల లోని వైఎస్‌ రాజారెడ్డి ఘాట్‌లో శనివారం ఉదయం 11 గంటల ప్రాంత్రంలో వివేకానందరెడ్డి భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. శనివారం ఉదయం ప్రార్థనలు ముగిసిన తర్వాత వైఎస్ వివేకా అంతిమ యాత్ర ప్రారంభమై కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానుల కన్నీటి వీడ్కోలుల మధ్య రాజారెడ్డి ఘాట్ కు చేరుకున్న వైఎస్‌ వివేకానందరెడ్డి పార్థీవ దేహాన్ని ప్రార్ధనల అనంతరం ఖననం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+