కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జ‌మ్మ‌ల‌మ‌డుగులో వైసీపీ విజ‌యం: ఆ ఇద్ద‌రూ క‌లిసినా..ఆప‌లేక‌పోయారు: 31,515 ఓట్ల మెజార్టీతో..!

|
Google Oneindia TeluguNews

రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ‌కు కార‌ణ‌మైన క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగులో వైసీపీ అనూహ్య విజ‌యం సాధించింది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో రామ‌సుబ్బారెడ్డి..ఆదినారాయ‌ణ రెడ్డి విభేదాలు వ‌ద‌లి టీడీపీ గెలుపు కోసం ప‌ని చేసారు. వైసీపీ నుండి సుధీర్ రెడ్డి పోటీలో ఉన్నారు. స‌రిగ్గా ఎన్నిక‌ల స‌మ‌యంలో వైయ‌స్ వివేకా మ‌ర‌ణంతో జ‌మ్మ‌ల‌మ‌డుగు ఫ‌లితం గురించి వైసీపీలో ఆందోళ‌న వ్య‌క్తం అయింది. అయితే, జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తి అక్క‌డ ప్ర‌చారం చేసారు. ఎట్ట‌కేల‌కు జ‌మ్మ‌ల‌మడుగులో వైసీపీ అభ్య‌ర్ది సుధీర్ రెడ్డి 31,515 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

ఏపీ ఫలితాల వేళ ట్విస్ట్.. కోడి కత్తి శీనుకు బెయిల్ ఏపీ ఫలితాల వేళ ట్విస్ట్.. కోడి కత్తి శీనుకు బెయిల్

ఆ ఇద్ద‌రూ క‌లిసినా..
జ‌మ్మ‌ల‌మ‌డుగులో కీల‌క ఫ‌లితం వెల్ల‌డైంది. 2014లో వైసీపీ నుండి జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యేగా గెలిచి ఆ త‌రువాత టీడీపీలో చేరి మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్నారు ఆదినారాయ‌ణ రెడ్డి. అప్ప‌టికే అక్క‌డ టీడీపీ నేత‌గా ఉన్న రామ‌సుబ్బారెడ్డి..ఆదినారాయ‌ణ రెడ్డి మ‌ధ్య ఉన్న అగాధం కార‌ణంగా పార్టీకి న‌ష్టం జ‌రుగుతుంద‌ని ఇద్ద‌రి మ‌ధ్య టీడీపీ అధినేత చంద్ర‌బాబు రాజీ చేసారు. ఫ‌లితంగా క‌డ‌ప ఎంపీ ఆదినారాయ‌ణ రెడ్డి..జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యేగా రామ‌సుబ్బారెడ్డిlr బ‌రిలోకి దించారు. అప్ప‌టికే వైసీపీ నుండి సుధీర్‌రెడ్డి వైసీపీ అభ్య‌ర్దిగా ఖ‌రార‌య్యారు. అక్క‌డ ఆ ఇద్ద‌రూ క‌ల‌వ‌టంతో ఇక వైసీపీ అభ్య‌ర్ది గెలుపు మీద అనుమానాలు మొద‌ల‌య్యాయి. అదే స‌మ‌యంలో జ‌మ్మ‌ల‌మ‌డుగు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న వైయ‌స్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌తో మ‌రోసారి జ‌మ్మ‌ల‌మ‌డుగులో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ మీద వైసీపీ నుండి అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి.

YCP won Jammaamdugu Assembly seat in Kadapa Dist..with majority 31,515 votes..

భార‌తీ ప్ర‌చారం..వైసీపీ గెలుపు..
అయితే, జ‌మ్మ‌ల‌మ‌డుగులో అడ్డు ఉండ‌కూడ‌ద‌నే కార‌ణంతో వివేకాను టీడీపీ నేత‌లే హ‌త్య చేసార‌ని వైసీపీ ఆరోపించింది. ఇక‌, ఎన్నిక‌ల ప్ర‌చారంలో జ‌గ‌న్ జ‌మ్మ‌ల‌మ‌డుగులో ప్ర‌చారం ఒక్క స‌భ‌లోనే పాల్గొన్నారు. జ‌గ‌న్ స‌తీమ‌ణి ఆ ఇద్ద‌రు ఆధిప‌త్యం ఉన్న గ్రామాల్లోకి వెళ్లి గ‌డ‌ప గ‌డ‌ప‌కు ప్ర‌చారం చేసారు. ఒక పోలింగ్ ముగిసిన త‌రువాత కూడా వైసీపీ గెలుపు పైన స్ప‌ష్ట‌త రాలేదు. కౌంటింగ్‌లో వైసీపీ అధిక్య‌త స్ప‌ష్టంగా క‌నిపించింది. టీడీపీ అభ్య‌ర్ది రామ సుబ్బారెడ్డి మీద వైసీపీ అభ్య‌ర్ది సుధీర్ రెడ్డి 31,515 ఓట్ల ఆధిక్య‌తంతో గెలుపొందారు. ఇక‌, ఇప్పుడు ఎంపీగా ఆదినారాయ‌ణ రెడ్డి ఓడిపోగా..ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసి అసెంబ్లీ బ‌రిలోకి దిగిన రామ‌సుబ్బారెడ్ది ఓడిపోయారు. దీంతో..ఇప్పుడు వారిద్ద‌రి రాజ‌కీయ భ‌విష్య‌త్ పైన సందేహాలు మొద‌ల‌య్యాయి.

English summary
YCP Candidate Sudhir Reddy won in Jammalamadugu constituency with 31,515 votes majority. TDP leaders ADinarayana Reddy and Rama Subba Reddy try to defeat YCp in this segment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X