Karimnagar News: అమ్మ కోసం వెళ్తూ అనంత లోకాలకు చేరిన చిన్నారి..
అతివేగం చాలా ప్రమాదకరం.. అందుకే రోడ్డుపై వెళ్తున్నప్పుడు మితమైన వేగంతో వెళ్లాలి. లేకుంటే ఎన్నో అనర్థాలు జరగొచ్చు. తాజాగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రోఘ రోడ్డు ప్రమాదం జరింది. రోడ్డు పక్కన ఉన్న చిన్నారిపై కారు దూసుకెళ్లింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన లోకిని జంపయ్య రాజేశ్వరి దంపతులు తిమ్మాపూర్ రాజీవ్ రహదారి పక్కనే ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. రాజేశ్వరి రహదారి పక్కన ఉన్న ఓ మొబైల్ టిఫిన్ సెంటర్‌లో పని చేస్తోంది. కూతురు శివాని(10) గుండ్లపల్లిలోని గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదివింది. తిమ్మాపూర్‌లో ఆరోతరగతిలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కొద్దిరోజులుగా ఇంటి దగ్గరే ఉంటోంది.

మద్యం మత్తులోనే..
శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి అమ్మ పని చేస్తున్న మొబైల్ క్యాంటీన్ వద్దకు వెళ్దామని వెళ్తుండగా సంతోష్‌కుమార్ అనే వ్యక్తి కారును అజాగ్రత్త, అతివేగంతో నడుపుతూ తిమ్మాపూర్ వద్ద శివానిని ఢీకొట్టాడు. అనంతరం స్టేజీ వద్ద ఉన్న విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టారు. స్థానికులు చిన్నారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్‌ఎండీ ఎస్సై ప్రమోద్ రెడ్డి తెలిపారు. కారులో ఉన్న ముగ్గురూ మద్యం సేవించి ఉన్నారని, ప్రమాదం జరిగిన తర్వాత కూడా సమీపంలోని వైన్స్ వెళ్లి మళ్లీ మద్యం సేవించి స్థానికులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications