Karimnagar News: కోతిని చూసి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి.. ఎలాగంటే..
ఓ కోతి నిండు ప్రాణం తీసింది. అయితే కోతి కరిచి ఆ వ్యక్తి చనిపోలేదు.. కేవలం కోతిని చూస్తేనే ప్రాణం పోయింది. అవును ఇది నిజం. ఈ ఘటన ఎక్కడో జరగలేదు. కరీంనగర్ లో జరిగింది. ఓ వ్యక్తి ఒక్కసారిగా కోతిని దగ్గర నుంచి చూడడంతో గుండె ఆగిపోయింది. కరీంనగర్ నగరంలోని హనుమాన్ నగర్‌లో రుద్రోజు రాజు(45) తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు.
మంగళవారం ఉదయం ట్యాప్ రావడంతో రాజు భార్య నిద్ర లేచింది. బిందెల్లో నీరు పట్టేందుకు తలుపులు తీసి బయటకు వెళ్లింది. అయితే ఆమె తలుపులు వేయలేదు. అయితే ఇంతలోనే తలుపులు తెరిచి ఉండడం చూసిన కోతి ఇంట్లోకి ప్రవేశించింది. ఆ సమయంలో రాజుతో పాటు ఆయన ఇద్దరు కుమారులు నిద్రపోతున్నారు.

రాజు భార్య బిందెలో నీరు పట్టుకుని ఇంట్లోకి వస్తుంది. అదే సయంలో కోతి కుమారుడి వద్దకు వెళ్లడాన్ని చూసింది. ఒక్కసారిగా కోతి అంటూ గట్టిగా కేకలు వేసింది. ఈ కేకలకు రాజు నిద్ర లేచాడు. అదే సమయంలో రాజు వద్ద కోతి ఉంది. అతను కళ్లు తెరవగానే కోతి కనిపంచడం. కోతి అంటూ షాక్ గురయ్యాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
అతడిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే రాజు గుండె పోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications