మోడీ అహంకారానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య హుజురాబాద్ ఎన్నిక: బాల్క సుమన్

హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం నేతల మధ్య మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటలు కోటలు దాటుతున్నాయి. హుజూరాబాద్ ఉపఎన్నికను బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కామెంట్ చేశారు. అంతేకాదు ఈటల రాజేందర్ వెనుక ప్రధాని మోడీ ఉన్నారని తెలిపారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ దీటుగా బదులిచ్చారు.

హుజూరాబాద్ ఉపఎన్నిక మోడీ అహంకారానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య జరుగుతుందని బాల్క సుమన్ అన్నారు. ఆత్మగౌరవ బావుట ఎగరేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హుజురాబాద్ జనాలకు అంతా తెలుసు అని చెప్పారు. ఓటుకు తగిన బుద్ది చెబుతారని పేర్కొన్నారు. పనిలో పనిగా బండి సంజయ్‌పై విమర్శలు చేశారు. పాదయాత్ర లక్ష్యంగా కామెంట్స్ చేశారు.

balka suman slams bandi sanjay

Recommended Video

    Balakrishna Speech At 21st Foundation Day Of Basavatarakam Cancer Hospital | Oneindia Telugu

    'కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడన్నట్టు బండి సంజయ్ పాదయాత్ర చేస్తాడట' అని బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. బండి సంజయ్ ఢిల్లీకి పాదయాత్ర చేయాలని కామెంట్ చేశారు. తెలంగాణలో పాదయాత్రతో ఒరిగేమీ లేదని చెప్పారు. దొంగలు, మోసగాళ్ల చేతికి చిక్కి తెలంగాణ ప్రజలు మోసపోవద్దని బాల్క సుమన్ సూచించారు. వారెవరో తెలుసే కదా అని ప్రశ్నించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+