కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Huzurabad Election Candidates:త్రిముఖ పోటీ..? ఈటలకు ధీటుగా ఆ ముగ్గురు.. కాంగ్రెస్ నుంచి ఆయన..?

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు హుజురాబాద్ బై పోల్ గురించే చర్చ.. ఆత్మగౌరవ నినాదంతో టీఆర్ఎస్ వీడిన ఈటల రాజేందర్.. బీజేపీలో చేరారు. కమలదళ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పాదయాత్రతో జనంతో మమేకం అవుతున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించలేదు.. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజల ముందుకు వస్తున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి అభ్యర్థులు ఎవరు.. ఏ సామాజిక సమీకరణాల ఆధారంగా టికెట్ ఇస్తారు. బలమైన అభ్యర్థి ఎంపిక ఎలా జరుగుతుంది. ఈటల రాజేందర్‌ను ఢీ కొట్టే ఆ ఇద్దరు ఎవరూ..?

Recommended Video

Huzurabad Election Candidates |Etela Rajender | TRS VS BJP VS CNG | Oneindia Telugu
ఆశావాహులు ఎక్కువే..

ఆశావాహులు ఎక్కువే..

టీఆర్ఎస్ నుంచి ఆశవాహులు ఎక్కువగానే ఉన్నారు. ఈటల రాజేందర్‌ను ఢీ కొనే నేత ఎవరనే అంశం చర్చ జరుగుతుంది. పాడి కౌశిక్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో ఈటల రాజేందర్‌కు ముచ్చెమటలు పట్టించారు. 50 వేలకు పైగా ఓట్లు సాధించి సవాల్ విసిరారు. ఇటీవల ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో ఆయన అభ్యర్థిత్వాన్ని పరిశీలించే అవకాశం ఉంది. అదే సమయంలో సీనియర్లు, సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే టికెట్ చేజారే ఛాన్స్ ఉంది.

 కౌశిక్ వద్దనుకుంటే మోత్కుపల్లి..?

కౌశిక్ వద్దనుకుంటే మోత్కుపల్లి..?

కౌశిక్ రెడ్డి వద్దనుకుంటే మోత్కుపల్లి నర్సింహులకు ఇచ్చే అవకాశం ఉంది. ఆయన సీనియర్ దళిత నేత.. దళిత ఓటు బ్యాంకు కాపాడుకోవాలంటే.. మోత్కుపల్లి నర్సింహులు మంచి అవకాశం. ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఒకవేళ మోత్కుపల్లి కాదనుకుంటే పెద్దిరెడ్డి అవకాశం ఉంటుంది. ఆయన బలమైన నేత.. మాజీమంత్రి, కార్మికనేతగా పనిచేశారు. దేవేందర్ గౌడ్‌తో సన్నిహితంగా ఉన్నారు. నవ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసి.. కీ రోల్ పోషించారు. తర్వాత బీజేపీలో చేరిన.. కేవలం ఈటల రాజేందర్‌ను వ్యతిరేకించి టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు.

పొన్నం ప్రభాకర్

పొన్నం ప్రభాకర్

ఇకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి పొన్నం ప్రభాకర్ పేరు వినిపిస్తోంది. ఈయన రేవంత్‌కు సన్నిహితులు.. ఇప్పటికే ప్రచారం చేశారు. వాస్తవానికి కౌశిక్ అంటే రేవంత్ అయిష్టత ఉండేది. దాంతో ఆడియో టేపులు రావడం.. పార్టీ నుంచి వెళ్లిపోవడం జరిగిపోయాయి. దీంతో పొన్నం ప్రభాకర్‌కు లైన్ క్లియర్ అయ్యింది. అంతకుముందు హుజురాబాద్ వెళితే కౌశిక్ వర్గం నుంచి నిరసనలు ఎదురయ్యాయి. ఇప్పుడు క్యాడర్ కాస్త మారడంతో ఇబ్బందులు తప్పేలా ఉన్నాయి. ఈటలను కాంగ్రెస్ నుంచి ఢీ కొనేది పొన్నం ప్రభాకరే.. టీఆర్ఎస్ నుంచి మాత్రం ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి.

దళిత బంధు..

దళిత బంధు..


బై పోల్ నేపథ్యంలో కేసీఆర్ అలర్ట్ అయ్యారు. దళిత బంధు పథకం తెరపైకి తీసుకొచ్చారు. ఈటల అనుచరుడికి కార్పొరేషన్ పదవీ కట్టబెట్టారు. ఎలాగోలా హుజురాబాద్‌లో గెలవాలని అనుకుంటున్నారు. దీనికి ధీటుగానే ఈటల రాజేందర్ ఎత్తుగడ వేస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకొని.. తనకు జరిగిన అన్యాయం వివరిస్తున్నారు.

English summary
trio fight in huzurabad by poll 2021. etela rajender from bjp trs, congress candidates are not confirmed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X