కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆరుసార్లు విజయదుందుబి.. వారి డిపాజిట్ గల్లంతు, ఈటలపై హరీశ్ రావు ఫైర్

|
Google Oneindia TeluguNews

హుజురాబాద్ బై పోల్ హీటెక్కిస్తోంది. ప్రచార పర్వంలో నేతలు బిజీ అయిపోయారు. మంత్రి హరీశ్ రావు, మాజీమంత్రి ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్దం జరుగుతోంది. తాను ఆరుసార్లు గెలిస్తే అందులో ఐదుసార్లు ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రిటైర్డ్ ఎంప్లాయిస్ ఉద్యోగుల కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడారు. ఒక్కసారి గాలి రావచ్చు.. ఇన్నిసార్లు గెలుస్తామా?. పనిచేయకపోతేనే ఇన్నిసార్లు గెలిపిస్తారా?. మాట మీద నిలబడకుంటేనే గెలిపిస్తారా?. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. ప్రతిసారి అంతకుముందు కంటే ఎక్కువ మెజార్టీ తెచ్చుకున్నానని తెలిపారు.

అవాకులు చవాకులు

అవాకులు చవాకులు

ప్రస్టేషన్‌తో ఈటల రాజేందర్ తనపై కూడా అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని హరీశ్ రావు ఫైరయ్యారు. ఈటలకు ఓటమి భయం పట్టుకుందని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ చాలా పేదోడని.. తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని చూసి కేసీఆర్ టికెట్ ఇచ్చారని హరీశ్ రావు తెలిపారు. కొంత మంది మాకు 200 ఎకరాలున్నాయి.. ఎకరం అమ్మితే ఎలక్షన్ గెలుస్తామని చెబుతున్నారు. మాకు ప్రజలే ఆస్తి.. వారి అండతో గెల్లు శ్రీనివాస్ గెలుస్తాడు. 2లక్షల 29 వేల మందికి మేలు జరగాలా.. ఒక్క ఈటలకే మేలు జరగాలా?. హుజురాబాద్ ప్రజలకు మాత్రం నష్టం జరుగుతుంది. ఒక వేళ ఈటల గెలిస్తే.. వ్యక్తిగా ఆయనకు మేలు జరుగుతుంది. ఈటల రాజేందర్ హుజురాబాద్ ప్రజలకు మేలు కావాలని ఏమన్నా రాజీనామా చేశాడా?. రైతుబంధు రూపంలో కుడిచేత కేసీఆర్ ఎకరాకు ఐదువేలిస్తుంటే.. ఎడమ చేత్తో డీజిల్ ధరలు పెంచి కేంద్రం లాక్కుంటోందని గుర్తుచేశారు.

 7.5 శాతం ఫిట్ మెంట్

7.5 శాతం ఫిట్ మెంట్

టీఆర్ఎస్ 30 శాతం ఫిట్ మెంట్ ఉద్యోగులకిస్తే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేవలం 7.5 శాతమే ఇచ్చిందని గుర్తుచేశారు. బండి సంజయ్ బీజేపీ నుంచి ఎంపీగా గెలిచి.. ఈ ప్రాంతంలో చిన్న పనైనా చేశారా?. కేసీఆర్‌కు దండం పెట్టైనా హుజురాబాద్‌కు ఇంజినీరింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీ తెస్తానని చెప్పారు. మరి ఆ శక్తి బీజేపీ వాళ్లకు ఉంటుందా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. రాష్ట్రం వచ్చిన తొమ్మిది నెలల్లోనే విద్యుత్ కొరత నుంచి బయటపడ్డామని, తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు విద్యుత్ అమ్మే స్థాయికి చేరిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే అందరు ఎందుకని హేళన చేశారు, కానీ కాళేశ్వరం మొదటి చుక్క హుజూరాబాద్ కె వచ్చిందని హరీష్ రావు వివరించారు.

Recommended Video

Huzurabad By Poll : హరీష్ రావు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు Etela Rajender
 బీడు భూముల్లో వరి

బీడు భూముల్లో వరి

నాటి బీడు భూముల్లో నేడు వరి ధాన్యం పండుతుందని, దేశంలో అత్యధిక వరిపండించే రాష్ట్రం తెలంగాణ అని.. ఏడేళ్లలో రాష్ట్రం ఈ ఘటన సాధించిందని తెలిపారు. అన్ని రంగాల్లో తెలంగాణ గుణాత్మకంగా ఎదిగిందని హరీష్ రావు తెలియచేశారు. బీజేపీ ప్రభుత్వం 7 ఏళ్లలో 7 శాతం ఫిట్మెంట్ ఇస్తే.. తెలంగాణ ప్రభుత్వం 30 శాతం ఫిట్మెంట్ ఇచ్చిందని తెలిపారు హరీష్. ఇక ఇదే సమయంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై విమర్శలు గుప్పించారు. ఎంపీగా గెలిచిన తర్వాత 2 లక్షల పనైనా చేయించాడా అని విరుచుకుపడ్డాడు. సంజయ్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని హరీష్ రావు అన్నారు. హుజూరాబాద్ లో బొట్టు పిల్లకు ఆసరా పెన్షన్ కు పోటీ అని వ్యాఖ్యానించారు.

English summary
huzurabad bypoll 2021:minister harish rao slams bjp leader etela rajender. every time majority increased he told.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X