Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేసీఆర్‌కు ప్రియమైన పథకాలు ఈటల వద్దన్నారు.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

హుజురాబాద్ బై పోల్ హీటెక్కిస్తోంది. బీజేపీ- టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఈటల రాజేందర్‌పై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఈటల రాజేందర్ తన బాధను అందరికీ అంటించాలని చూస్తున్నారని విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్‌కు ఇష్టమైన కళ్యాణలక్ష్మీ, ఆసరా పెన్షన్, రైతుబంధు పథకాలను ఈటల రాజేందర్ వద్దన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కమలాపూర్ గడ్డపై నుంచి చెబుతున్నా.. మీకు ఎలాంటి మానవత్వం లేదన్నారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ అని, కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా రాదని హరీశ్ రావు కుండబద్దలు కొట్టీ మరీ చెప్పారు.

 minister harish rao made sensational comments on etela rajender

హరీశ్ రావు కామెంట్లపై ఈటల రాజేందర్ స్పందించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కౌంటర్ అటాక్ చేశారు. పేదల పక్షాన జీవితాంతం అండగా ఉంటానని తెలిపారు. తనపై తప్పుడు ప్రచారాలు చేస్తూ నకిలీ లేఖలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌ వాళ్లు ఏమైనా కుట్ర పన్ని తనపై దాడి చేస్తున్నారా? అనే అనుమానం కలుగుతుందని సందేహాం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ కుట్రలకు హుజురాబాద్‌ ప్రజలు గుణపాఠం చెబుతారని ఈటల రాజేందర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. అక్టోబర్‌ 30న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. నవంబర్‌ 2న కౌంటింగ్‌ చేపట్టనున్నట్లు పేర్కొంది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేశారు. అక్టోబర్ 8వరకు నామినేషన్ దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించారు. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13గా ప్రకటించింది. అక్టోబర్ 30వ తేదీన ఎన్నికల నిర్వహిస్తారు. నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటిస్తారు.

హుజురాబాద్‌లో విజయం టీఆర్ఎస్- బీజేపీకి తప్పనిసరి. గెలుపు కోసం ఆ రెండు పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అధికార పార్టీకి విజయం కంపల్సరీ.. లేదంటే మొహం చూపించుకునే పరిస్థితి ఉండదు. ఇక బీజేపీ పరిస్థితి అయితే మరీ దారుణం.. పార్టీకి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ.. అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మాత్రం జీవన్మరణ సమస్యే.. ఎందుకంటే ఆయన ఓడిపోతే రాజకీయంగా కోలుకోలేని దెబ్బ.. ఇక రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరీ హుజురాబాద్ ప్రజలు ఏం తీర్పు చెప్పనున్నారో చూడాల్సిందే.

Recommended Video

    పెరిగిన నిత్యవసర సరుకులపై కార్యాచరణ ప్రకటించిన టీపిసిసి మహిళా నేత సునిత రావు

    హుజురాబాద్ బై పోల్ నేపథ్యంలోనే దళితబంధు పథకం తెరపైకి వచ్చింది. పథకంపై విపక్షాలు గుర్రు మంటున్నాయి. దళితులు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని అడుగుతున్నారు. ఎన్నికలు/ బై పోల్ నేపథ్యంలో వారు గుర్తుకు వస్తారా అని అడుగుతున్నారు. లేదంటే బడుగు బలహీన వర్గాలు గుర్తుకురారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పే అబద్దాలను ప్రజలు వినే స్థితిలో లేరని చెప్పారు. వారు అన్నీ గమనిస్తున్నారని వివరించారు. చేసిన న్యాయ, అన్యాయలను గుర్తుకు ఉంచుకుంటారని తెలిపారు. సమయం చూసి బుద్ది చెబుతారని.. బై పోల్‌లో గుణపాఠం తప్పదని అంటున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలే తమ పాలిట విజయం చేకూరుస్తాయని చెబుతున్నారు. తాము చేసిన పనులే.. విజయానికి నాంది పలుకుతాయని తెలిపారు. దళిత బంధు ఇతర పథకాలపై ప్రభుత్వం.. ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఏ వైపు ఉంటారో చూడాలీ మరీ. టీఆర్ఎస్ లేదా.. విపక్షాల వైపు చూస్తారో చూడాలీ మరీ.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+