Karimnagar: పెద్ద కొడుకు ప్రభుత్వ ఉద్యోగి.. చిన్న కుమారుడు సాఫ్ట్ వేర్.. కానీ అంతలోనే..
పెద్ద కొడుకు రైల్వేలో ఉద్యోగి, చిన్న కొడుకు సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. ఇంకెముంది ఆ తల్లిదండ్రులు నిశ్చితంగా ఉండొచ్చని అనుకున్నారు. ఇన్ని రోజులు రెక్కలు ముక్కలు చేసుకుని కుమారులను చదివిస్తే ఫలితం వచ్చిందని సంతోషించేలోపే దేవుడు వారికి తీరని అన్యాయం చేశాడు. రోడ్డు ప్రమాదంలో రూపంలో ఇద్దరూ కొడుకుల్ని బలి తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగలలో జరిగింది.
గ్రామానికి చెందిన ఇప్పలపల్లి మనోహర్, శారద దంపతలకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు పేరు శివరాం, కాగా చిన్న కుమారుడి పేరు హరికృష్ణ. శివరాం కొద్ది రోజుల క్రితం రైల్వే టికెట్ కలెక్టర్ ఉద్యోగానికి సెలక్ట్ అయ్యాడు. చిన్నకుమారుడు హరికృష్ణకు కూడా గతేడాదే ఇన్ఫోసిస్ కంపెనీలో జాబ్ వచ్చింది. వీరిద్దరు ఇటీవలే స్వగ్రామానికి వచ్చారు. కొద్ది రోజులు ఊరిలో గడిపారు.

శివరాం రైల్వే టికెట్ కలెక్టర్ జాబ్ శిక్షణ కోసం హైదరాబాద్ రావాలి, అలాగే హరికృష్ణ కూడా తిరిగి హైదరాబాద్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇద్దరు కలిసి సోమవారం ఉదయం హైదరాబాద్‌కు ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. ఎల్కతుర్తి శివారు అనసాగర్ సమీపంలోకి రాగానే గుర్తు తెలియని వాహనం వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు.
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపించారు. మనోహర్ గ్రామాల్ల అంగడ్లకు వెళ్తూ దుస్తులు అమ్మవాడని స్థానికులు చెబుతున్నారు. ఎంత కష్టపడి పిల్లలను చదివించారని ఇంతలోనే ఇలా జరగడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శివరాం రైల్వే టికెట్ కలెక్టర్ ఉద్యోగంతో పాటు ఇటీవల పోస్టల్ శాఖలోనూ మరో ఉద్యోగం వచ్చినట్లు చెప్పారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications