కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కారులో కూర్చొనే పార్టీ కావాలో.. కారు ఎక్కించే పార్టీలో కావాలో తేల్చుకుండి: హరీశ్ రావు

|
Google Oneindia TeluguNews

హుజురాబాద్ బై పోల్‌లో మాటల మంటలు కొనసాగుతున్నాయి. రైతుల‌ను కారెక్కించే టీఆర్ఎస్‌ పార్టీ కావాల్నా..? రైతుల‌పైకి కారెక్కించే బీజేపీ కావాల్నా?.. మీరే తేల్చుకోండి అని మంత్రి హ‌రీశ్‌రావు కామెంట్ చేశారు. జ‌మ్మికుంట మండ‌లం మాచాన్‌ప‌ల్లి గ్రామంలో ఆదివారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జ‌డ్పీటీసీ శ్యాంతో క‌లిసి ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. బీజేపీకి ఓటేస్తే ఏం ప్రయోజ‌నం క‌లుగుతుందో హుజూరాబాద్ ప్ర‌జ‌లు ఆలోచించుకోవాల‌ని కోరారు. బీజేపీ మీటింగ్ అంటేనే నాలుగు తిట్లు.. న‌లుగురిని రెచ్చ‌గొట్ట‌డం..నాలుగు ఓట్లు పొందడం అని విమ‌ర్శించారు.

హుజురాబాద్‌లో కాలేజీ..

హుజురాబాద్‌లో కాలేజీ..

ఈట‌ల రాజేంద‌ర్ త‌న స్వార్థం కోసం రాజీనామా చేశాడ‌ని, జ‌మ్మికుంటకు మెడిక‌ల్ కాలేజీ కావాల‌ని, హుజూరాబాద్ జిల్లా కావాల‌నే డిమాండ్‌తో రాజీనామా చేయ‌లేద‌ని హ‌రీశ్‌రావు అన్నారు. ఈట‌ల రాజేంద‌ర్ హైద‌రాబాద్‌లో మెడిక‌ల్ కాలేజీ పెద్ద‌గా క‌ట్టుకున్నాడ‌ని, మ‌రి ఇక్క‌డ ప్ర‌జ‌ల‌పై ప్రేమ ఉంటే జ‌మ్మికుంట‌లోనే ఆ కాలేజీ క‌ట్టొచ్చు క‌దా? అని ప్ర‌శ్నించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక రెండేళ్ల కాలానికి మాత్ర‌మేన‌ని, ఆ కాలంలో రాష్ట్రంలో అధికారంలో ఉండేది టీఆర్ఎస్ పార్టీ మాత్ర‌మేన‌ని మంత్రి హ‌రీశ్‌రావు చెప్పారు. సీఎం కేసీఆర్ మాట ఇస్తే త‌ప్ప‌ర‌ని తెలిపారు. టీఆర్ఎస్‌ను గెలిపిస్తే రూ. 200 పింఛ‌న్‌ను వెయ్యి రూపాయ‌లు చేస్తా అని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చార‌ని, గెలువగ‌నే చేసి చూపించార‌న్నారు. మ‌ళ్లీ ఎన్నిక‌ల్లో త‌న‌ను గెలిపిస్తే వెయ్యి రూపాయల పింఛ‌న్‌ను రూ. 2016కు పెంచుతా అని చెప్పార‌ని, పెంచి నెల‌నెలా ఠంచ‌న్‌గా ఇస్తున్నార‌ని తెలిపారు.

రైతుల సంక్షేమం

రైతుల సంక్షేమం

రైతుల‌కు ఎక‌రాకు ఇస్తున్న రూ.నాలుగు వేల రైతుబంధును రూ. 5 వేలు చేస్తా అని చెప్పి.. చేసిండా? లేదా? అని ప్ర‌శ్నించారు. క‌ల్యాణ‌ల‌క్ష్మి కింద మొద‌ట రూ. 50 వేలు ఎస్సీల‌కే ఇచ్చార‌ని, ఆ త‌ర్వాత త‌మ‌ను గెలిపిస్తే రూ. ల‌క్షా నూట ప‌ద‌హార్లు అంద‌రికీ ఇస్తా అని కేసీఆర్‌ హామీ ఇచ్చార‌ని, అన్న‌ట్లుగానే చేసి చూపించార‌ని మంత్రి హ‌రీశ్‌రావు గుర్తుచేశారు. కేసీఆర్ కిట్ ఇచ్చి పేదింటి ఆడబిడ్డకు ప్రభుత్వ ద‌వాఖాన‌లో ఉచితంగా కాన్పు చేయడం లేదా? అని ప్రశ్నించారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చిన పార్టీ దేశంలో ఏదైనా ఉందా? అని అడిగారు. మూడేళ్లలో కాళేశ్వ‌రం ప్రాజెక్టు క‌ట్టామ‌ని, ఆ నీటితో అన్న‌దాత‌లు యాసంగిలో కూడా పంట పండిస్తున్నార‌ని హ‌రీశ్‌రావు అన్నారు.

మీటర్లు..

మీటర్లు..

ఈట‌ల రాజేంద‌ర్ చేరిన పార్టీ బీజేపీ అని, ఆ పార్టీ బాయిల కాడ మీట‌ర్లు పెడ‌తామ‌ని చెబుతున్న‌ద‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. ఆంధ్రా సీఎం ఇప్పటికే మీటర్లు పెట్ట‌డం ప్రారంభించాడ‌ని, కానీ త‌న ప్రాణం పోయినా బాయికాడ మోటార్ల‌కు మీట‌ర్లు పెట్ట‌నియ్య‌న‌ని సీఎం కేసీఆర్ అంటున్నార‌ని తెలిపారు. బాయికాడ మీట‌ర్లు పెడతామ‌ని ఈట‌ల రాజేందర్ పార్టీ అంటోంద‌ని, కానీ ఉచిత క‌రెంటు ఇస్తున్న‌ది గెల్లు శ్రీనివాస్‌ యాద‌వ్ పార్టీ అని అన్నారు. కొత్త వ్యవసాయ చట్టాల‌తో అన్న‌దాత ఉసురుపోసుకుంటున్న బీజేపీలో ఈట‌ల రాజేంద‌ర్ చేరాడ‌ని, ఆయ‌న‌కు ఓటుతోనే త‌గిన బుద్ధి చెప్పాల‌ని మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌జ‌ల‌కు సూచించారు. కారు గుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనివాస్‌యాద‌వ్‌ను గెలిపిస్తే హుజూరాబాద్ అభివృద్ధి బాధ్య‌త తాను చూసుకుంటాన‌ని తెలిపారు.

ప్రజల తీర్పు

ప్రజల తీర్పు

హుజురాబాద్‌లో విజయం టీఆర్ఎస్- బీజేపీకి తప్పనిసరి. గెలుపు కోసం ఆ రెండు పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అధికార పార్టీకి విజయం కంపల్సరీ.. లేదంటే మొహం చూపించుకునే పరిస్థితి ఉండదు. ఇక బీజేపీ పరిస్థితి అయితే మరీ దారుణం.. పార్టీకి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ.. అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మాత్రం జీవన్మరణ సమస్యే.. ఎందుకంటే ఆయన ఓడిపోతే రాజకీయంగా కోలుకోలేని దెబ్బ.. ఇక రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరీ హుజురాబాద్ ప్రజలు ఏం తీర్పు చెప్పనున్నారో చూడాల్సిందే.

Recommended Video

Ponnala Lakshmaiah Criticized Modi For Accepting Credit For 100 Crore Vaccinations
బ్రేక్..

బ్రేక్..

హుజురాబాద్ బై పోల్ నేపథ్యంలోనే దళితబంధు పథకం తెరపైకి వచ్చింది. పథకంపై విపక్షాలు గుర్రు మంటున్నాయి. దళితులు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని అడుగుతున్నారు. ఎన్నికలు/ బై పోల్ నేపథ్యంలో వారు గుర్తుకు వస్తారా అని అడుగుతున్నారు. లేదంటే బడుగు బలహీన వర్గాలు గుర్తుకురారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పే అబద్దాలను ప్రజలు వినే స్థితిలో లేరని చెప్పారు. వారు అన్నీ గమనిస్తున్నారని వివరించారు. చేసిన న్యాయ, అన్యాయలను గుర్తుకు ఉంచుకుంటారని తెలిపారు. సమయం చూసి బుద్ది చెబుతారని.. బై పోల్‌లో గుణపాఠం తప్పదని అంటున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలే తమ పాలిట విజయం చేకూరుస్తాయని చెబుతున్నారు. తాము చేసిన పనులే.. విజయానికి నాంది పలుకుతాయని తెలిపారు. దళిత బంధు ఇతర పథకాలపై ప్రభుత్వం.. ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఏ వైపు ఉంటారో చూడాలీ మరీ. టీఆర్ఎస్ లేదా.. విపక్షాల వైపు చూస్తారో చూడాలీ మరీ. కానీ ఈసీ దళితబంధు పథకానికి బ్రేక్ ఇచ్చింది.

English summary
minister harish rao slams bjp and etela rajender. trs party agenda is peoples welfare he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X