ఓ ఇల్లాలు మౌన పోరాటం.. 25 రోజులుగా భర్త ఇంటి ముందు నిరసన

ఆన్‌లైన్‌లో ఏర్పడిన పరిచయంతో పదేళ్ల పాటు ప్రేమించుకున్నారు. పెద్దలు నిరాకరించడంతో ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు. కలిసి నడవాల్సిన జీవితంలో భర్త కాపురానికి తీసుకెళ్ళకుండా ఒంటరిగా భార్యను వదిలేసి పరారయ్యాడు. దీంతో బాధితురాలు 25 రోజులుగా అత్తారింటి ముందు న్యాయం కోసం భీష్మించుకుని కూర్చుంది.

కడప జిల్లాకు చెందిన సుహాసినికి కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లోని విద్యానగర్‌కు చెందిన సుజిత్‌రెడ్డి 2011 ఆన్‌లైన్‌లో పరిచయం అయ్యాడు. ఆ పరిచయంతో ఇద్దరు పదేళ్ల పాటు ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు ఒక్కటైనప్పటికి సుజిత్‌రెడ్డి కుటుంబం సభ్యులు పెళ్లికి నిరాకరించడంతో 2020 నవంబర్ 25న సుహాసిని-సుజిత్ ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులను ఒప్పించి కాపురానికి తీసుకువెళతా అని చెప్పిన సుజిత్...సుహాసినిని వదిలేసి వెళ్ళిపోయాడు.

 wife protest in front of husbands house in karimnagar

మాటలతో ఏడాది గడిచిపోయింది ..భార్యను కాపురానికి తీసుకెళ్లలేదు. భర్తతో కలిసి ఉండడానికి నవంబర్ 26న హుజురాబాద్ లోని భర్త ఇంటికి వచ్చింది. ఇంట్లోకి పిలిచి కుటుంబ సభ్యులు తన పై దాడి చేశారని బాధితురాలు కన్నీటి పర్యంతమవుతోంది. తల్లిదండ్రులు మరణించడంతో సుహాసిని ఒంటరి అయ్యింది. ఆదరించాల్సిన భర్త ముఖం చాటేశాడు. కాపురానికి వచ్చిన కోడలిని బయటకు గెంటేసి ఇంటికి తాళం వేసి పరారయ్యారు అత్తింటి వారు. గేటు వద్ద కూర్చుకొని భర్త కోసం ఎదురు చూస్తోంది.

2018లో కువైట్‌లో ఉన్న తనను ఇండియాకు రప్పించి వివాహం చేసుకుంటామని చెప్పి రప్పించారని బాధితురాలు చెప్తోంది. తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మిగిలపోయిన తనను అత్తింటి వారు ఆదరించడం లేదని సుహాసిని ఆవేదన వ్యక్తం చేస్తుంది. గత 25 రోజులుగా అత్తావారింటి ముందు కూర్చుని నిరసన తెలుపుతున్నా కనికరించడం లేదంటోంది. చలిలో న్యాయ పోరాటం చేస్తున్న బాధితురాలికి కొన్ని రోజుల పాటు ఇరుగు పొరుగు వారు ఆహార పానీయాలు అందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+