లారీ బోల్తా.. 4 వేల చేపలు మాయం.. వ్యాపారికి నష్టం
ఏదైనా లారీ బోల్తా పడితే.. అందులో సరుకు.. అంటే మద్యం, చేపలు, ఉంటే అంతే సంగతులు. అందులో ఉన్న డ్రైవర్, క్లీనర్ గురించి అక్కడ ఉన్న వారు ఆలోచించరు. వెంటనే తమకు తోచినవి తీసుకెళ్లేందుకు ఉత్సాహ పడతారు. అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు చూశాం. మళ్లీ ఇలాంటి సిచుయేషన్ భద్రాద్రి కొత్తగూడెంలో జరిగింది. అయితే ఇక్కడ చేపల లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడింది. ఇంకేముంది చుట్టుపక్కల ఉన్న వారు పండగ చేసుకున్నారు.

నిమిషాల్లో ఖాళీ
బీరు బాటిళ్లతో వెళ్తున్న లారీలు, చేపల లోడ్ తో వెళ్తున్న వాహనాలు ప్రమాదానికి గురైనప్పుడు.. వాహనంలోని సరుకును స్థానిక ప్రజలు నిమిషాల్లో ఖాళీ చేసిన ఘటనలు చూశాం. ఇలాంటి ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. లారీపై నుంచి పడిపోయిన చేపలను తీసుకెళ్లడానికి స్థానిక ప్రజలు పోటీపడ్డారు. లారీ పడిన కొద్దినిమిషాల్లో చేపలు మాయం అయ్యాయి.

లారీ బోల్తా..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఐటీసీ క్రాస్ రోడ్డు వద్ద చేపల లారీ బోల్తా పడింది. ఆంధ్రప్రదేశ్ నుంచి నాగపూర్ వైపు వెళ్తున్న లారీ.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి పడిపోయింది. ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలు కావటంతో చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లారీ బోల్తాకొట్టడంతో అందులోని చేపలు రోడ్డుపక్కకు పడిపోయాయి. కొద్ది నిమిషాల్లోనే ఇక్కడి చేపలను స్థానికులు తీసుకెళ్లారు.

పట్టుకెళ్లిన స్థానికులు
చేపల లారీ పడిన విషయం చుట్టుపక్కల ప్రజలకు తెలిసింది. దీంతో భారీగా తరలివచ్చారు. ఎవరికి దొరికిన చేపలను వారు పట్టుకెళ్లారు. స్థానికులు చేరుకోవటంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. విషయం తెలిసిన పోలీసులు స్థానికులను కట్టడిచేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. లారీలో సుమారు ఒక్కొక్కటి 2 కేజీల బరువు ఉన్న చేపలు నాలుగు వేల వరకు ఉన్నాయి. లారీ పడిన నిమిషాల వ్యవధిలోనే చేపలను స్థానికులు తీసుకెళ్లారు. దీంతో ఆ వ్యాపారికి నష్టం వాటిల్లింది.

చేపల కూర
ఐటీసీ క్రాస్ రోడ్డు సమీపంలో ఏ ఇంట్లో చూసిన చేపల కూర ఉంది. కానీ సదరు వ్యాపారి మాత్రం నష్టపోయారు. ఇంతకుముందు బీర్లతో వెళుతున్న లారీ కూడా పడిపోయింది. ఆ వెంటనే బీర్ల కేసులు కేసులే మాయం అయిపోయాయి.












Click it and Unblock the Notifications