Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లోకసభ ఎన్నికలు 2019: ఖమ్మం నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

Recommended Video

    Lok Sabha Election 2019 : Khammam Lok Sabha Constituency, Sitting MP, MP Performance Report

    తెలంగాణ రాష్ట్రంలోని 17 లోకసభ నియోజకవర్గాల్లో ఖమ్మం ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గెలిచారు. 1952 నుంచి 2014 వరకు 16సార్లు లోకసభ ఎన్నికలు జరిగాయి. 1952లో తొలిసారి పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (హైదరాబాద్) నుంచి విఠల్ రావు గెలిచారు. 1957లో అదే విఠల్ రావు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి గెలిచారు.

    1962, 1967, 1971లలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి లక్ష్మీకాంతమ్మ (మూడుసార్లు), 1977, 1980 నుంచి అదే కాంగ్రెస్ పార్టీ నుంచి జలగం కొండల్ రావు (రెండుసార్లు), 1984, 1989 జలగం వెంగళరావు (రెండుసార్లు కాంగ్రెస్ నుంచి), 1991లో రాఘవయ్య నాయుడు (కాంగ్రెస్) నుంచి గెలిచారు.

    1996లో తమ్మినేని వీరభద్రం (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్ట్), 1998లో కాంగ్రెస్ నుంచి నాదెండ్ల భాస్కర రావు, 1999, 2004లలో కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి (రెండుసార్లు), 2009లో టీడీపీ నుంచి నామా నాగేశ్వరరావు పోటీ చేసి గెలిచారు. 2014లో వైసీపీ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గెలిచారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

    #LokSabhaElection2019: All about khammam Constituency

    మొత్తంగా ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పదకొండుసార్లు, లెఫ్్ పార్టీ రెండుసార్లు, టీడీపీ ఒకసారి, వైసీపీ ఒకసారి గెలిచింది.

    ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో 14,40,289 ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 7,12,329, మహిళా ఓటర్లు 7,27,960 ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 19,48,347 జనాభా ఉంది. ఈ నియోజకవర్గంలో గ్రామీణ జనాభా 73.49%, పట్టణ జనాభా 26.51% ఉంది. ఇందులో ఎస్సీ సామాజిక వర్గం18.36%, ఎస్టీ సామాజిక వర్గం 19.42%గా ఉంది.

    2014లో ఈ నియోజకవర్గంలో 11,82,897 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే 82 శాతం మంది ఓటు వేశారు. ఇందులో పురుష ఓటర్లు 5,88,728, మహిళా ఓటర్లు 5,94,169 ఉన్నారు.

    2014లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (వైసీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్‌లో చేరారు) టీడీపీ అభ్యర్థి నామా నాగశ్వర రావు పైన 11వేల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. పొంగులేటికి 4,21,957 ఓట్లు, నామాకు 4,09,983 ఓట్లు వచ్చాయి. ఇక్కడ లెఫ్ట్ పార్టీ ప్రభావం ఎక్కువ. కానీ నాటి ఎన్నికల్లో సీపీఐ నుంచి పోటీ చేసిన కంకణాల నారాయణకు 1,87,653 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థి బుడాన్ బేగ్ షేక్‌కు కేవలం 89వేల ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి 27 మంది పోటీ చేశారు.

    పొంగులేటి శ్రీనివాస రెడ్డి గ్రాడ్యుయేట్ చేశారు. ఎంపీలాడ్స్ నుంచి నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.17.69 కోట్లు ఖర్చు చేశారు. పార్లమెంటులో ఇతను 32 చర్చల్లో పాల్గొన్నారు. తెలంగాణ యావరేజ్ 36.7 శాతంగా ఉండగా, నేషనల్ యావరేజ్ 63.8 శాతంగా ఉంది. ప్రయివేటు మెంబర్ బిల్స్ ఏమీ ప్రవేశపెట్టలేదు. పార్లమెంటులో 393 ప్రశ్నలు అడిగారు. ఇది తెలంగాణ యావరేజ్ 285గా, నేషనల్ యావరేజ్ 273గా ఉంది. పార్లమెంటరీకి హాజరు శాతం 65 ఉంది. తెలంగాణ యావరేజ్ 69 శాతం ఉంది.

    ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బొగ్గు గనులు ఉంటాయి. ఉమ్మడి జిల్లాల్లో ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్. పెప్పర్, కాజు, మామిడి, అరటి, కొబ్బరి తదితర పంటలు ఇక్కడ ఎక్కువగా పండుతాయి. ఇక్కడ ఎస్టీ సామాజిక వర్గం ఎక్కువ. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ జిల్లా ఆర్థికంగా వెనుకబడి ఉంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+