ఓనర్ కాదు రాక్షసీ.. పనిమనిషిపై అఘాయిత్యం.. వీడియో తీసి బెదిరింపు.. రూ.10 లక్షలు..?
ఆమె ఇంటి ఓనర్.. మహిళే కదా అని అనుకునేరు. జర జాగ్రత్త.. ఎందుకంటే ఆమెలో మరో కోణం కూడా ఉంది. ఇంటికి పనికి పిలిచి లైంగికదాడి చేసే పెను ప్రమాదం ఉంది. ఖమ్మంలో జరిగిన ఘటన ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఇంటి ఓనర్.. మహిళే ఘటనలో కీ రోల్ పోషించడం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. చివరికీ ఆ పనిమనిషి ధైర్యం చేయడంతో విషయం బయటపడింది.
ఖమ్మంలో దారుణం జరిగింది. టీచర్స్ కాలనీకి చెందిన మహిళ ఇంట్లో ఒకామె పని చేస్తోంది. ఈ నెల 13న ఆమె ఇంటికి కొందరు బంధువులు వచ్చారు. ఆ ఇంట్లో పని చేస్తున్న పనిమనిషిపై వారి కన్ను పడింది. ఇంటి యజమాని సాయంతో టీ లో మత్తు కలిపారు. బంధువుల్లో ఒకడు సయ్యద్ హుస్సేన్ పనిమనిషిపై అత్యాచారం చేశాడు. ఇంటి యజమాని ఆ దారుణాన్ని వీడియో తీసింది.

డబ్బులు ఇవ్వాలని పనిమనిషిని బెదిరించింది. డబ్బు ఇవ్వకపోతే వీడియోను సోషల్ మీడియాలో పెడతానని ఇంటి ఓనర్ హెచ్చరించింది. దీంతో పనిమనిషి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు సయ్యద్ హుస్సేన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. ఇంటి యజమాని గతంలో కూడా ఓ వ్యాపారిని ఇలాగే ట్రాప్ చేసినట్టు తెలుస్తోంది. రూ. 10 లక్షలు డిమాండ్ చేసిందని పోలీసులు వెల్లడించారు.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications