ఖమ్మం జిల్లాలో భూప్రకంపనలు, ఇళ్ళ నుంచి పరుగు పెట్టిన ప్రజలు, రాత్రంతా జాగారం

ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందులో భూప్రకంపనలు స్థానికులను భయాందోళనకు గురి చేశాయి. గురువారం అర్ధరాత్రి ప్రకంపనలు వచ్చాయి. రాత్రి గం.11.26 నిమిషాలకు ఇల్లందులో ప్రకంపనలు వచ్చాయి. గఢనిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు.

నిద్రపోతున్న వారు లేచి బయటకు పరుగులు తీశారు. గురువారం రాత్రి ఐదు సెకన్ల పాటు భూమి కంపించింది. కొత్తగూడెం, సుజాతనగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో ప్రకంపనలు వచ్చాయి.

Mild tremors in Khammam

భూకంపంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చిన ప్రజలు లోపలికి వెళ్లేందుకు భయపడ్డారు. మళ్లీ ఎక్కడ వస్తుందోనని రాత్రి జాగారం చేశారు. అవి కేవలం చిన్నపాటి ప్రకంపనలేనని అధికారులు చెబుతున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మళ్లీ వచ్చే అవకాశం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+