Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాహుబలి సెట్టింగులు, 250కోట్ల భారీబడ్జెట్ తో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్!!

ఖమ్మం :పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బాహుబలి రేంజ్ లో భారీ సెట్టింగ్స్ తో తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే విధంగా కుమార్తె రిసెప్షన్ వేడుకలను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారంనాడు జరుగుతున్న రిసెప్షన్ వేడుక కోసం ఎస్ఆర్ గార్డెన్ అట్టహాసంగా ముస్తాబైంది.

100 ఎకరాలలో పొంగులేటి కుమార్తె రిసెప్షన్

100 ఎకరాలలో పొంగులేటి కుమార్తె రిసెప్షన్

25 ఎకరాలలో రిసెప్షన్ వేదిక, 25 ఎకరాల్లో భోజన వేదికలు, మరో వంద ఎకరాల లో పార్కింగ్ ఏర్పాట్లను చేశారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక రిసెప్షన్ కార్యక్రమానికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సాగర్ కెనాల్ పైన సొంత ఖర్చులతో రెండు స్టీల్ బ్రిడ్జి లను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్మింపజేశారు. పొంగులేటి కుమార్తె రిసెప్షన్ వేడుకకు మూడు లక్షల మంది అతిథులకు ప్రత్యేక భోజన ఏర్పాట్లు అత్యంత ఘనంగా చేసినట్టుగా తెలుస్తోంది.

బాహుబలి రేంజ్ భారీ సెట్టింగ్ లు, ఇంటింటికీ పత్రికలతో పాటు గోడ గడియారాలు

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ ఆగస్టు 17న, నేడు ఖమ్మంలో అత్యంత ఘనంగా జరుగుతోంది. పెళ్లికి ఆహ్వానించేందుకు పెళ్లి పత్రికలతో పాటు గోడ గడియారాలు బహుమతిగా గ్రామగ్రామాన ప్రతి ఒక్కరికి పంపించారు. అలాగే రిసెప్షన్ వేదికపై బాహుబలి రేంజ్ లో భారీ సెట్టింగ్స్ నిర్మించడం విశేషం. వర్షాలు కురుస్తుండటంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా తాత్కాలికంగా వాటర్ ప్రూఫ్ షెడ్లు నిర్మించి ఎవరికీ ఎటువంటి అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

వాహనాల రాకపోకల కోసం కోటి రూపాయల సొంత ఖర్చుతో వంతెన నిర్మాణం

వాహనాల రాకపోకల కోసం కోటి రూపాయల సొంత ఖర్చుతో వంతెన నిర్మాణం

అంతే కాదు వేడుకలకు వచ్చే వాహనాల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని కాలువపై రూ.కోటితో వంతెన నిర్మించారు. కేవలం నెల రోజుల్లోనే ఈ ఇనుప వంతెన పూర్తి చేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సత్తా చూపించారు. దాదాపు పది లక్షల మందిని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన కుమార్తె వివాహ రిసెప్షన్ కు ఆహ్వానించారు.

ఇండోనేషియాలోని బాలిలో పొంగులేటి కుమార్తె పెళ్లి

ఇండోనేషియాలోని బాలిలో పొంగులేటి కుమార్తె పెళ్లి


ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన ఏకైక కుమార్తె స్వప్ని రెడ్డి పెళ్లి వేడుకలు ఇండోనేషియాలోని బాలి లో కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల మధ్య అట్టహాసంగా నిర్వహించారు. ఈనెల 12వ తేదీన రాత్రి ఇండోనేషియాలోని బాలి లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రామ సహాయం సురేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు, పలువురు ఇతర ప్రముఖుల సమక్షంలో అత్యంత ఘనంగా వివాహం జరిగింది. బాలీలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు తనకు అత్యంత సన్నిహితులు, ఇరు కుటుంబాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు దాదాపు 500 మందిని ప్రత్యేక విమానాలలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బాలికి తీసుకెళ్లారు.

పొంగులేటి కుమార్తె పెళ్లి రిసెప్షన్ కు జగన్ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు

పొంగులేటి కుమార్తె పెళ్లి రిసెప్షన్ కు జగన్ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు

ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ వేడుక అత్యంత వైభవంగా జరగడంతో, 250 కోట్ల రూపాయల అతి భారీ బడ్జెట్ తో రెండు తెలుగు రాష్ట్రాలలో కనీవినీ ఎరుగని విధంగా ఈ రిసెప్షన్ జరగనున్న నేపథ్యంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుమార్తె రిసెప్షన్ గురించి చర్చ జరుగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+