ఏపీలో వర్ష బీభత్సం: రోడ్డుపై చేపలు వదిలిన టీడీపీ నేత..
ఏపీలోనూ వర్ష బీభత్సం కొనసాగుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. జనం ఇబ్బంది పడుతున్నారు. వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పలు చోట్ల రోడ్ల పరిస్థితి అంతగా బాగోలేదు. భారీ గుంతలు ఏర్పడి, నీళ్లు నిలిచిపోయాయి. దీంతో జనం ఇబ్బంది అంతా ఇంత కాదు.
కైకలూరు నియోజకవర్గంలో రోడ్లు చేపల చెరువుల్లా మారాయి. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ నిరసన చేపట్టారు. టీడీపీ కార్యకర్తలతో కలిసి ఆయన కైకలూరు నియోజకవర్గంలోని ఓ రోడ్డుపై నీరు నిలిచిన గుంతల్లో చేప పిల్లలను వదిలి వినూత్న తరహాలో నిరసన తెలియజేశారు. టీడీపీ శ్రేణులు నినాదాలు చేశాయి. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ అవుతుంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం తీవ్ర రూపం దాల్చింది. చత్తీస్‌ఘడ్ ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉండటంతోపాటు ఉపరితల ఆవర్తనం కూడా చురుగ్గా కదులుతుంది. మరో మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితిని బట్టి మరో 3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షం వల్ల వరదనీరు నిల్వడం వల్ల దోమలు ఎక్కువ అవుతాయి. దీని వల్ల జ్వరాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఆహారం కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే మలేరియా, టైపాయిడ్, వైరల్ జ్వరాలు వ్యాపించే అవకాశాలు ఉన్నాయి.
►కైకలూరు నియోజకవర్గంలోని రోడ్ల పరిస్థితి చేపల చెరువులాగా ఉన్నాయని.. నిరసనగా రోడ్లు పై చేప పిల్లలను వదిలిన మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ మరియు తెలుగుదేశం నాయకులు.@JaiTDP pic.twitter.com/k3OuOzZPE6
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) July 12, 2022












Click it and Unblock the Notifications