ఏపీలో కరోనా: ఆ జిల్లాలో ఊహించని ఘటన.. కలెక్టర్ కీలక ప్రకటన..షేర్ చెయ్యండి..

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తికి సంబంధించి మోస్ట్ ఎఫెక్టెడ్ రెండు జిల్లాల్లో మొదటిది గుంటూరు(122 కేసులు) కాగా, రెండోది కర్నూలు. ఇక్కడ ఇప్పటిదాకా 113 కేసులు నమోదుకాగా, రెండు మరణాలు సంభవించాయి. కొవిడ్-19 కారణంగా బుధవారం చనిపోయిన రెండో వ్యక్తి ఒక డాక్టర్ కావడంతో జిల్లాలో మళ్లీ భయాందోళనలు పెరిగాయి. తనకు వైరస్ ఉందన్న సంగతి తెలియకుండానే ఆ డాక్టర్ వందలమందికి ట్రీట్మెంట్ చేశారు. దీంతో కాంటాక్ట్ ట్రేసింగ్ పై అధికారులు దృష్టి సారించారు.

అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

కొవిడ్-19తో చనిపోయిన ఆ డాక్టర్.. కర్నూలు సిటీలోని ఉస్మానియా కాలేజీ రోడ్డులో గల ‘కేఎం ఆస్పత్రి'లో పనిచేసేవారని అధికారులు గుర్తించారు. ఇటీవల ఏపీ సహా దేశమంతటా అసింప్టమాటిక్(రోగ లక్షణాలు కనిపించకుండా వ్యాధికి గురికావడం) కేసులు పెరుగుతూ వస్తున్నాయి. కర్నూలు డాక్టర్ కూడా ఆస్పత్రిలో చేరిన కొద్ది రోజులకే ప్రాణాలు కోల్పోవడంతో ఇది కూడా ఆ తరహా కేసేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా, డాక్టర్ వయసు 76 ఏళ్లు కావడంతో ఆయన కోలుకునే వీలులేకుండా పోయింది. ఊహించని రీతిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి కలెక్టర్ వీరపాండియన్ గురువారం కీలక ప్రకటన చేవారు.

దయచేసి వినండి..

దయచేసి వినండి..

‘‘జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ప్రత్యేకించి కర్నూలు పట్టణంలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సిటీలోని ఉస్మానియా కాలేజీ రోడ్డులో గల ‘కేఎం ఆస్పత్రి'లో సిటీలో ఒక కొవిడ్-19 కేసును గుర్తించాం. ఇది ఒకరి ద్వారా మరొకరికి అంటుకునే వైరస్ కాబట్టి.. మార్చి 20 నుంచి ఏప్రిల్ 11వ కేఎం ఆస్పత్రికి వచ్చిన ప్రతి ఒక్కరికీ వైరస్ అంటుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ తేదీల్లో అక్కడికి వెళ్లినవాళ్లంతా వెంటనే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలి. లేదా 8333988955 నంబర్ కు మెసేజ్ గానీ, వాట్సాప్ ద్వారాగానీ వివరాలు తెలియపర్చాలి. సకాలంలో స్పందించి, పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధి ఉన్నది లేనిది నిర్ధారణ చేసుకోవచ్చు. అప్పటివరకు మీరు ఇంట్లో అందరికీ దూరంగా ఉండండి. ఇతరులను కలవడం, వస్తువులను ముట్టుకోవడం లాంటివి చేయకండి'' అని జిల్లా కలెక్టర్ ప్రజలను కోరారు.

ట్రేసింగ్ వేగవంతం..

ట్రేసింగ్ వేగవంతం..


చనిపోయిన డాక్టర్ ఇదివరకు కొవిడ్-19 పేషెంట్లకు ట్రీట్మెంట్ చేయలేదని, వేరే కాంటాక్ట్ ద్వారానే ఆయనకు వైరస్ సోకి ఉండొచ్చని జిల్లా వైద్య అధికారులు చెప్పారు. డాక్టర్ మరణం తర్వాత ‘కేఎం ఆస్పత్రి'ని తాత్కాలికంగా సీజ్ చేశారు. అక్కడున్న పేషెంట్లను.. ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నడవలేనివాళ్లను అంబులెన్సుల్లో తీసుకెళ్లారు. కేఎం ఆస్పత్రిలో పనిచేసిన నర్సులు, సహాయక సిబ్బందితోపాటు ఆయా తేదీల్లో ఆస్పత్రికి వచ్చిన కొంత మందిని ట్రేస్ చేసి క్వారంటైన్ కు తరలించారు. ఇంకా ఎవరెవరు అక్కడికి వెళ్లారో కనిపెట్టేందుకే కలెక్టర్ పబ్లిక్ అప్పీలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+