చైనాలోనే కర్నూలు యువతి: ఆమెకు కేంద్రమంత్రి హామి, జ్యోతి కోసం కాబోయే భర్త యాగం

బీజింగ్/న్యూఢిల్లీ: చైనాలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ కర్నూలుకు చెందిన యువతి జ్యోతిని తిరిగి స్వస్థలానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా, జ్యోతి మరో వీడియోను విడుదల చేశారు. తనకు ఎలాంటి వైరస్ లక్షణాలు బయటపడలేదని, వెంటనే తనను ఇక్కడ్నుంచి తీసుకెళ్లాలని భారత ప్రభుత్వానికి ఆమె విన్నవించారు.

కాలయాపన చేస్తున్నారంటూ..

కాలయాపన చేస్తున్నారంటూ..


చైనా అధికారులు తనకు ఎలాంటి పరీక్షల చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆమె వాపోయారు. అంతేగాక, తన వీసా గడువు ఫిబ్రవరి 19న ముగుస్తుందని.. తనను వెంటనే స్వస్థలానికి తీసుకెళ్లాలని భారత ప్రభుత్వాన్ని జ్యోతి వేడుకుంది. తనకు కరోనా వైరస్ లేకున్నా.. ఇక్కడి అధికారులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

సాధారణ జ్వరమే అయినప్పటికీ..

సాధారణ జ్వరమే అయినప్పటికీ..


కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామానికి చెందిన అన్నె జ్యోతికి ఉద్యోగం రావాడంతో.. శిక్షణ కోసం ఆమె చైనా వెళ్లారు. ఇప్పుడు ఆమె శిక్షణ కూడా దాదాపు పూర్తయింది. ఈ క్రమంలో జ్యోతి భారత్‌కు వచ్చేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయినప్పటికీ.. ఆమె శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటంతో చైనా అధికారులు ఆమెను అక్కడే ఆపివేశారు. సాధారణ జ్వరమే అయినప్పటికీ అనుమానంతో చైనా అధికారులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఆమె అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో తనను కాపాడాలంటూ ఆమె ఓ వీడియోను విడుదల చేశారు.

కొద్ది రోజుల్లోనే పెళ్లి...

కొద్ది రోజుల్లోనే పెళ్లి...


ఇది ఇలావుంటే, ఆమెకు త్వరలోనే వివాహం జరగాల్సి ఉండటం గమనార్హం. మహానంది మండలం తమ్మడపల్లెకి చెందిన అమర్నాథ్ రెడ్డితో జ్యోతికి వివాహం నిశ్చయమైంది. గత జూన్ 23న వీరిద్దరికి నిశ్చితార్థం జరగగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 14న వివాహాన్ని నిర్ణయించుకున్నారు. దీంతో చైనాలో ఉన్న జ్యోతిని వెంటనే స్వస్థలానికి తీసుకువచ్చేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని ఆమె కుటుంబసభ్యులు, వరుడి కుటుంబసభ్యులు కోరుతున్నారు.

జ్యోతి కోసం కాబోయే భర్త యాగం..

జ్యోతి కోసం కాబోయే భర్త యాగం..

జ్యోతిపై బెంగతో ఆమె తల్లి ఆరోగ్యం క్షీణించింది. ఆమెను మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పరామర్శించారు. జ్యోతితో వీడియో కాల్‌లో మాట్లాడారు. ఆమెను ఇండియాకు తీసుకొచ్చేందుకు తనవంతుగా కృషి చేస్తానని తెలిపారు. కాగా, జ్యోతి క్షేమంగా తిరిగిరావాలంటూ ఆమెకు కాబోయే భర్త అమర్నాథ్ రెడ్డి యాగం నిర్వహించారు. జ్యోతి ఆరోగ్యంగానే ఉన్నారని, ఆమెను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని ఆయన కోరారు.

జ్యోతికి భరోసా ఇచ్చిన కేంద్రమంత్రి..

జ్యోతికి భరోసా ఇచ్చిన కేంద్రమంత్రి..

ఈ నేపథ్యంలో జ్యోతిని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలంటూ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ను నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, అనకాపల్లి ఎంపీ డాక్టర్ వెంకట సత్యవతి కోరారు. ఈ సందర్భంగా జ్యోతితో కేంద్రమంత్రి ఫోన్లో మాట్లాడారు. ఆందోళన చెందవద్దని, త్వరలోనే ఇండియాకు తీసుకొస్తామని ఆమెకు భరోసా ఇచ్చారు. ఇంకా 80మందికిపైగా భారతీయులు చైనాలోనే ఉండిపోయారని, వారందర్నీ కూడా తీసుకువస్తామని చెప్పారు. అంతేగాక, పాక్ జాతీయులను కూడా తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామని, అయితే పరిస్థితులు అనుకూలంచకపోవడంతో విరమించుకున్నామని తెలిపారు. కాగా, కేంద్రమంత్రి హామీ ఇవ్వడంతో జ్యోతి కుటుంబసభ్యులకు కొంత ఉపశమనం లభించినట్లయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+