ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఎస్కార్ వాహనం బోల్తా..ముగ్గురికి తీవ్ర గాయాలు
కర్నూలు: శాసన మండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి కాన్వాయ్ లోని పోలీస్ ఎస్కార్ట్ వాహనం ప్రమాదానికి గురైంది. మంగళవారం ఉదయం ఆళ్లగడ్డ సమీపంలో కర్నూలు-కడప జాతీయ రహదారిపై బోల్తా పడింది. టైరు పేలడం వల్లే ఈ ప్రమదం చోటు చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనలో ఎస్కార్ట్ వాహనంలో ప్రయాణిస్తోన్న ఆర్మ్డ్ రిజర్వుడ్ పోలీస్ ఎస్ఐ సహా ముగ్గురు పోలీస్ కానిస్టేబుళ్లు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని చికిత్స నిమిత్తం కర్నూలులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ఈ ఉదయం గంగుల ప్రభాకర్ రెడ్డి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆళ్లగడ్డ నుంచి చాగలమర్రికి బయలుదేరి వెళ్లారు. ఆళ్లగడ్డ దాటిన కొద్దిసేపటికే ఆయన కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనం ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారిపై భారత్ పెట్రోలియం బంక్ సమీపంలోకి చేరుకోగానే ఎస్కార్ వాహనం టైరు ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ పేలిపోయింది. ఫలితంగా-డ్రైవర్ వాహనాన్ని నియంత్రించలేకపోయారు. దీనితో అదిరోడ్డు వారగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు ఆయన పక్క సీటులో కూర్చుని ఉన్న ఎస్ఐ, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ఎస్ఐ చేతికి తీవ్ర గాయమైంది.

ఈ సమాచారం అందుకున్న వెంటనే ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డి, ఆళ్లగడ్డ రూరల్ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని అంబులెన్స్ లో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. వారిలో ఓ కానిస్టేబుల్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్ఐ కాలు విరిగినట్లు గుర్తించారు. టైరు పేలడమే ప్రమాదానికి కారణమని గుర్తించారు. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో గంగుల ప్రభాకర్ రెడ్డి ప్రయాణిస్తోన్న కారు.. ఎస్కార్ట్ వాహనం కంటే ముందే వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. బాధితుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని గంగుల బిజేంద్ర రెడ్డి హామీ ఇచ్చారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications