వామ్మో.. స్వీట్ షాపులో చోరీ.. నగదుతోపాటు మిఠాయిలు కూడా

చిత్ర, విచిత్ర ఘటనలు జరుగుతున్నాయి. అవును దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. అంటే నగదు, నగలే కాదు తినుబండారాలు కూడా.. అవును మీరు చదివేది నిజమే.. కర్నూలులో దొంగలు కొత్త సంప్రదాయనికి తెరతీశారు. స్వీట్ షాపులో పడి.. నగదుతోపాటు స్వీట్స్ కూడా తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీలో ఇదీ స్పస్టంగా కనిపించింది.

సాధారణంగా దొంగలు నగదు, నగలు, విలువైన వస్తువులు దోచుకెళ్తుంటారు. అయితే ఓ స్వీట్ షాపులోకి చొరబడిన దొంగలు నగదుతోపాటు స్వీట్స్ కూడా దోచుకెళ్లారు. కర్నూలు పట్టణంలో ఈ ఘటన జరిగింది. పట్టణంలోని రాజ్‌విహార్‌ సెంటర్‌లో ఉన్న మిఠాయిల దుకాణం షెట్టర్ పగలగొట్టి లోపలికి వెళ్లి క్యాష్‌బాక్స్ లోని నగదు తీసుకున్నారు. అనంతరం నేతిమిఠాయిలను కూడా తమతో తెచ్చుకున్న సంచిలో వేసుకొని పారిపోయారు. చదవడానికి వింతగా ఉన్న ఇదీ నిజంగా నిజం. దొంగలు ఏంటీ వారికి టెస్ట్ ఉండదా అనే వారు కూడా ఉంటారు. వారికి సమాధానంగా వీరు ఇలా చేశారు.

theft broke into sweet shop and stole cash and sweets

షట్టర్ పగలగొట్టి ఉండటంతో ఉదయం అటుగా వచ్చిన వాకర్స్ షాపు యజమానికి సమాచారం ఇచ్చారు. వేంటనే షాప్ వద్దకు చేరుకొని షాపు యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు షట్టర్ ఓపెన్ చేసి పరిశీలించారు. నగదుతోపాటు స్వీట్స్ కూడా దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. షాపులోని సీసీకెమెరాలతోపాటు చుట్టుపక్కన ఉన్న సీసీటీవీలను పరిశీలిస్తున్నారు.

అయితే వీరు దొంగలా.. తెలిసినవారేనా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఆ స్వీట్స్ రుచి గురించి తెలిసినవారికే తెలుసు. లేదంటే కొత్త వారు వచ్చి తీసుకెళతారా అనే సందేహం కలుగుతుంది. కానీ దీనిపై స్పష్టత లేదు. పోలీసులు విచారణ జరిపి.. నిగ్గుతేల్చాలి. అయినప్పటికీ ఈ దొంగతనం మాత్రం నిజంగా విడ్డూరమే.. ఇప్పటివరకు ఇలాంటి దొంగతనం మనం చూడలేదు. వినలేదు కూడా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+