8 నెలల నుంచి సంబంధం, స్నేహితులతో కూడా పెట్టుకోవాలట..మహిళ దీనగాధ
అండగా ఉంటానని మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొన్నాళ్లు సవ్యంగానే సాగింది. తర్వాత తన వక్రబుద్దిని చూపించాడు. తన స్నేహితులతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని కోరాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో ఆమెను చిత్రహింసలకు గురిచేసి అర్ధరాత్రి నడిరోడ్డుపై వదిలేసాడు. మహబూబ్ నగర్‌లో జరిగిన ఘటన కలకలం రేపుతోంది.

8 నెలల నుంచి కంటిన్యూ..
మ్యారేజి బ్యూరో నిర్వహించే మహిళతో జడ్చర్లకు చెందిన వెంకటేశ్ గౌడ్ వివాహేతర సంబంధం కొనసాగింది. 8 నెలల నుంచి వీరి బంధం కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా ఆమెను కలవటం లేదు. భార్యకు ఆరోగ్యం సరిగా లేకపోవటంతో కలవలేక పోతున్నానని చెప్పాడు. అండగా ఉంటానని ఆమెకు చెప్పి.. తన భార్యతోనూ మాట్లాడించాడు. మహబూబ్ నగర్‌కు చెందిన మిత్రుడు వెంకటేష్ తదితరులతో కూడా వివాహేతర సంబంధం పెట్టుకోవాలని సూచించాడు. ఆ మాటలకు మహిళ షాక్‌నకు గురైంది. అతడి సూచనను కాదంది.

ఇంటికి పిలిచి మరీ..
ఈ నెల 2వ తేదీన జడ్చర్లలోని తన ఇంటికి పిలిపించాడు. ఆమెను కారులో ఎక్కించుకుని తన బావమరిదితో కలిసి మహబూబ్ నగర్ వెళ్లాడు. క్రిస్టియన్‌పల్లి మీదుగా భూత్పూర్ వెళ్లారు. దాబాలో పెద్ద వెంకటేష్ గౌడ్ తమ్ముడు చిన్న వెంకటేష్ గౌడ్‌తోపాటు మరో ఇద్దరు వ్యక్తులు కారులో ఎక్కారు. తమతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని ఐదుగురు కలిసి ఆమెను కారులో వేధించారు. అక్కడి నుంచి తిరిగి జడ్చర్ల మీదుగా అర్ధరాత్రి దాటాక రెండు గంటల సమయంలో మయూరి నర్సరీ సమీపంలో ఆమె పర్సు, మొబైల్ లాక్కుని కారులోంచి దింపి వెళ్లిపోయారు.
Recommended Video

కాలినడకన డీఎస్పీ ఆఫీసుకు
కాలినడకన అర్ధరాత్రి వేళ మహబూబ్ నగర్‌లోని పాత డీఎస్పీ ఆఫీసుకు చేరుకుంది. ఎవరు లేకపోవటంతో జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని గేటువద్ద ఉన్న కానిస్టేబుళ్లకు తన గోడు వెళ్లబోసుకుంది. వారు ఆమెను వన్ టౌన్ పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. మూడు గంటలకు డీఎస్పీ శ్రీధర్ వచ్చి ఆమె నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. నిందితులు పోలీసులను ప్రభావితం చేశారని, తన ఫోన్‌లో గల ఫోటోలు, వీడియోలు ఆడియో రికార్డింగ్ డిలీట్ చేసి పోలీసులకు అప్పగించారని బాధితురాలు ఆరోపించింది.












Click it and Unblock the Notifications