మహబూబ్‌నగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫోన్ చేస్తే వైద్యం.. కరోనా అని భయపడొద్దు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

|
Google Oneindia TeluguNews

కరోనాను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. కరోనా సోకిన వారి ఇంటి వద్దకు వెళ్లి వైద్య సేవను అందించనున్నారు. అందుకోసం వారు ఫోన్ చేయాల్సి ఉంటుంది. ఆ వెంటనే ఇంటికి వచ్చి వైద్యం అందిస్తారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరించారు. వైరస్ సోకిన రోగుల ఇంటి వద్దకు వెళ్లి వైద్యం అందిస్తామని చెప్పారు.

ఇంటికెళ్లి మరీ పరిశీలన

ఇంటికెళ్లి మరీ పరిశీలన

కరోనాను ఎదుర్కోవడంలో భాగంగా ఇంటింటా ఆరోగ్యం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజలు కరోనా వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదని, ముందు జాగ్రత్తలు తీసుకుకోవాలని సూచించారు. ఇంటింటా ఆరోగ్యం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో గల ఎనుగొండలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మంత్రి మాట్లాడారు. జ్వరాలు, దగ్గు ఇతర అనారోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

వైద్యం..

వైద్యం..

కరోనా వైరస్‌కు అన్ని రకాల వైద్యం అందించడంలో భాగంగా ప్రభుత్వం ఇంటింటా ఆరోగ్యం పేరుతో సర్వే నిర్వహించి జ్వరం, దగ్గు ఇతర కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారికి వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఆక్సిజన్ పడకలతో సహా అవసరమైన మందులు, ఇతర ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు.

అందరికీ వైద్యం..

అందరికీ వైద్యం..

జిల్లాలో ఇంటింటా ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా 1,89,319 ఇళ్లకు వెళ్లి వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశ, అంగన్ వాడీ కార్యకర్తలు సర్వే నిర్వహిస్తారని తెలిపారు. జిల్లాలో 40 వేల కరోనా ఐసోలేషన్ కిట్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అవసరమైతే లక్ష కిట్లు ఇస్తామని చెప్పారు. ఎవరికైనా చికిత్స అవసరమైతే 08542-241165కు ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి వైద్యం అందించే ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

వైరస్ వర్రీ

వైరస్ వర్రీ


కరోనా తోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. ఇక ఒమిక్రాన్ వేరియంట్ వలన ప్రాణాపాయం చాలా తక్కువని, మైల్డ్ సింటమ్స్ మాత్రమే ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు.కరోనా కేసులు భారీగా వస్తున్నాయి. ఈ నెల ఆఖరు.. ఫిబ్రవరిలో భారీగా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రముఖులను కూడా కేసులు వదలడం లేదు. హెల్త్ వర్కర్లు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు కరోనా సోకుతుంది.

English summary
make a call:health workers will give service minister srinivas goud said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X