గో బ్యాక్ కేసీఆర్, అల్లుడు-కూతురి కోసం దొంగిలించి ఎలా వచ్చావ్: నిరసన సెగ (వీడియో)
ఆందోల్/మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆందోల్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు నిరసన సెగ తగిలింది. చాలామంది ద్విచక్ర వాహనాల పైన కేసీఆర్‌కు, తెరాసకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకొని బయలుదేరారు. కేసీఆర్ డౌన్ డౌన్.. రైతుల ఐక్యత వర్ధిల్లాలి అని వారు నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఈ ర్యాలీ తీసినట్లుగా ఉంది.
ఆ తర్వాత వారంతా కలిసి రోడ్డుపై బైఠాయించారు. కేసీఆర్ గో బ్యాక్, వీ వాంట్ జస్టిస్ అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సింగూరు జలాల అక్రమ తరలింపును వెంటనే ఆపాలని వారు డిమాండ్ చేశారు. ఎత్తిపోతల పథకాలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. మా నీళ్లు మాకు కావాలని సింగూరు జలాలపై నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడారు.

అల్లుడు, కూతురు, కొడుకు కోసం అక్రమంగా తరలింపు
సింగూర్ నీళ్లు మా తలాపున ఉన్నాయని, దీని కోసం ఆందోల్ ప్రాంత రైతులు తమ భూములు కోల్పోయి నష్టపోయారని వారు చెప్పారు. మా ప్రాంతంలో పారుతున్న ఈ సింగూరు నీరును తమ ప్రాంతానికి ఇవ్వకుండా వాళ్ల కొడుకు కేటీఆర్, బిడ్డ కవిత, అల్లుడు హరీష్ రావులతో పాటు తన కోసం, ఓట్ల లబ్ధి కోసం అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. తమ ప్రాంతంలోని నీరును ఇతర నియోజకవర్గాలకు ఎత్తుకెళ్లడం సరికాదన్నారు. తమ ప్రాంతాన్ని ఎడారిగా మార్చారన్నారు.

మళ్లీ ఓట్లు అడిగేందుకు ఎలా వచ్చావ్
గతంలో కేసీఆర్ ఆందోల్ కట్ట పైన కూర్చీ వేసుకొని కూర్చోని, ఈ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు అందిస్తామని చెప్పారని వారు చెప్పారు. కానీ ఈ రోజు మళ్లీ ఓట్లు అడిగేందుకు వచ్చారని, ఆయన ఏ ముఖం పెట్టుకొని వచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. తమకు చుక్కనీరు ఇవ్వకపోగా, మా సింగూరు నీరును దొంగిలించి, మా ప్రాంతాన్ని ఎడారిగా మారుస్తావా అని మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ ఓట్లు అడిగేందుకు ఎలా వచ్చావని ప్రశ్నించారు.

ఏ ముఖం పెట్టుకొని వచ్చావ్
లక్ష ఎకరాలకు నీరు ఇస్తానని కేసీఆర్ చెప్పారని, కానీ అది నెవవేరలేదని మరొకరు అన్నారు. ఆ దొర కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని మళ్లీ ఓట్లు అడిగేందుకు వస్తున్నారని ప్రశ్నించారు. మీ కూతురు, అల్లుడు, కొడుకు కోసం వారి నియోజకవర్గాలకు 17 టీఎంసీల నీరును తీసుకెళ్లి, మా రైతుల నోట్లో మట్టి కొట్టావని మండిపడ్డారు. దీనికి కేసీఆర్ మూల్యం చెల్లించికోవాలన్నారు. ఇక్కడి ప్రజలు కేసీఆర్‌కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
కేసీఆర్ గో బ్యాక్
ఈ రోజు ఆందోల్ సభకు రూ.500 నుంచి రూ.1000 ఇచ్చి తీసుకు వెళ్తున్నారని, డబ్బులు తీసుకొని ప్రజలు వెళ్లవచ్చునని, కానీ ఓట్లు మాత్రం నిజాయితీగా కాంగ్రెస్ పార్టీకి వేయాలని వారు అన్నారు. కేసీఆర్ దుర్మార్గమైన చర్యకు పాల్పడుతున్నారని, అందుకే ఆయనను గో బ్యాక్ అంటున్నామని, ఆయన మళ్లీ రావొద్దన్నారు. అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications