ఘోర రోడ్డు ప్రమాదం: గాల్లో ఎగిరి కాల్వలో పడిన కారు, ఏడుగురు మృతి

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శివ్వంపేట మండలం ఉసిరికపల్లి వద్ద బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, ముగ్గురు పిల్లలు, ఓ వ్యక్తి ఉన్నారు. వీరంతా పాముబండ తండాకు చెందినవారిగా గుర్తించారు.

రహదారిపై గుంతల వల్ల కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. ఆ తర్వాత గాల్లోకి ఎగిరి పక్కనే ఉన్న కాల్వలో పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఏడుగురు నీటమునిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Car accident in Medak district Seven killed

కెమికల్ సంపులో పడి కవలలు మృతి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో తీవ్ర విషాదం నెలకొంది. కంపెనీలో పనిచేసేందుకు వచ్చి కవలలు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఓ కంపెనీలో రెనోవేషన్ పనులు జరుగుతున్నాయి. కవలలైన అన్నదమ్ములు రాము, లక్ష్మణ్ కంపెనీలో ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తున్నారు. ప్రమాదవశాత్తు లక్ష్మణ్ కెమికల్ సంపులో పడిపోయాడు. గమనించిన రాము వెంటనే తమ్ముడిని కాపాడేందుకు ప్రయత్నం చేశాడు.

Car accident in Medak district Seven killed

ఈ క్రమంలో రాము కూడా కెమికల్ సంపులో పడిపోవడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. షాపూర్‌నగర్‌లోని రామ్ రాజ్ ఆస్పత్రికి మృతదేహాలు తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అన్నదమ్ములు ఒకేసారి మరణించడంతో వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+